Abn logo
Aug 8 2020 @ 22:34PM

మాజీ మంత్రి గంటా మేనల్లుడి డ్రైవర్‌ అరెస్ట్

విశాఖపట్నం : నగరంలోని మధురవాడ వికలాంగుల కాలనీలో అక్రమంగా ల్యాండ్ రెగ్యులరైజేషన్ పట్టాల వ్యవహారాన్ని ఎమ్మార్వో, పోలీసులు బట్టబయలు చేశారు. అక్రమంగా ల్యాండ్ రెగ్యులరైజేషన్ చేస్తున్నట్లు స్థానికులు రూరల్ ఎమ్మార్వోకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎమ్మార్వో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పీఎం పాలెం పోలీసులు ఇద్దర్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన ఈ నిందితుల్లో మాజీ మంత్రి గంటా మేనల్లుడు విజయ్ డ్రైవర్‌ కూడా ఉన్నాడు. దీంతో ఈ వ్యవహారం జిల్లాలో చర్చనీయాంశమైంది.


అయితే వీరి వెనుక ఉన్నదెవరు..? ఎవరి అండ చూసుకుని ఇలా ఈ నిందితులు రెచ్చిపోయారు..? ఈ వ్యవహారం వెనుక ఏదైనా ముఠా ఉన్నదా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు మీడియా అందిస్తామని పోలీసులు చెబుతున్నారు.

Advertisement
Advertisement
Advertisement