అయిజలోని గుంత రామలింగేశ్వరాలయంలో పూజలు చేస్తున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు, నాయకులు
- జిల్లా నుంచి తరలనున్న 10వేల మంది నాయకులు
- గద్వాల నుంచి తొమ్మిది గంటలకు ప్రత్యేక రైలు
- మరో 300 వాహనాల్లో కార్యకర్తల తరలింపు
గద్వాల/అయిజ, జూలై 2: ప్రధానమంత్రి నరేంద్రమోదీ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు భారీ జన సమీకరణకు గద్వాల బీజేపీ నాయకులు ఏర్పాట్లు చేశారు. శనివారం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వాహనాల ఏర్పాట్లపై చ ర్చించారు. జిల్లా నుంచి 300వాహనాలలో కార్యక ర్తలను తరలించాలని నిర్ణయించారు. అదేవిదంగా జోగుళాంబ హాల్ట్ నుంచి ప్రత్యేక రైలును ఏర్పాటు చేశారు. ఈ రైలు ఉదయం ఏడు గంటలకు కర్నూ ల్‌లో బయలుదేరి 7:15కు జోగుళాంబ హాల్ట్‌కు చేరుకుంటుంది. అక్కడ అలంపూర్ నియోజకవర్గం కార్యకర్తలతో బయలుదేరి ఉదయం 8:30 గంటలకు గద్వాలకు చేరుకుంటుంది. గద్వాలలో 9గంటలకు బయలుదేరుతుందని పార్టీ జిల్లా అధ్యక్షుడు రాం చంద్రారెడ్డి తెలిపారు. రైలు అనుకున్న సమయానికే వెళుతుందని, కార్యకర్తలు సకాలంలో రైల్వేస్టేషన్‌కు చేరుకోవాలని ఆయన కోరారు. రైలు అందుబాటు లో లేని ప్రాంతాల నుంచి 300 వాహనాల్లో కార్యక ర్తలను తరలిస్తున్నట్లు ఆయన తెలిపారు. మోదీ సభ విజయవంతం కావాలని నాయకులు వివిధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. జిల్లా అధ్య క్షుడు రాంచంద్రారెడ్డి అయిజలోని గుంత రామలిం గేశ్వర ఆలయంలో పూజలు చేశారు. నాయకులు ఆంజనేయులు, వెంకటేష్‌యాదవ్, లక్ష్మణ్, ప్రదీప్‌కుమార్, వెంకటేష్, నవీన్‌కుమార్, జానకిరాములు, షరీఫ్, కృష్ణ, పరశురాముడు, నీలేంద్ర తదితరులున్నారు.