ఎమ్మార్పీఎస్‌ పోరాట ఫలితమే ‘ఆరోగ్యశ్రీ’

ABN , First Publish Date - 2022-08-08T05:52:47+05:30 IST

ఎమ్మార్పీఎస్‌ పోరాట ఫలితమే ‘ఆరోగ్యశ్రీ’

ఎమ్మార్పీఎస్‌ పోరాట ఫలితమే ‘ఆరోగ్యశ్రీ’

పెద్దేముల్‌/పరిగి/తాండూరు, ఆగస్టు 7 : ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పోరాటం వల్లే ఆరోగ్యశ్రీ పథకం సాకారం జరిగిందని ఎంఎస్‌ఎఫ్‌ జిల్లా కన్వీనర్‌ మల్లికార్జున్‌ మాదిగ పేర్కొన్నారు. ఆదివారం పెద్దేముల్‌ మండల మంబాపూర్‌ గ్రామంలో ఆగస్టు 7వ తేదీని ఆరోగ్యశ్రీ సాధన దినోత్సవాన్ని నిర్వహించారు. ఎంఎస్పీ మండల ఇన్‌చార్జి స్వామిదాస్‌ మాదిగ, ఆల్‌ ఇండియా అంబేద్కర్‌ సంఘం డివిజన్‌ అధ్యక్షుడు వెంకట్‌, గ్రామపెద్దలు ప్రకాష్‌, ఎంఎస్‌ఎఫ్‌ నాయకులు కిరణ్‌, లాజర్‌, అశోక్‌, గోరప్ప, గోపాల్‌, కవిరాజ్‌, ప్రవీణ్‌, సద్దాం, మదర్‌భాయ్‌, ఆశమ్మ పాల్గొన్నారు. అలాగే ఎమ్మార్పీఎస్‌ పోరాట ఫలితమే ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చారని ఎమ్మార్పీఎస్‌ తాలుకా అధ్యక్షుడు రమేశ్‌ అన్నారు. పరిగిలో ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో ఆరోగ్యశ్రీ సాధన దినోత్సవం జరుపుకున్నారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్‌ నాయకులు ప్రశాంత్‌, శివ,అఖిల్‌, కార్తీక్‌, కిరణ్‌రాజులు పాల్గొన్నారు.  అలాగే తాండూరు పట్టణంలోని ఐషు డాన్స్‌ క్లబ్‌లో ఎమ్మార్పీఎస్‌, మహాజన సోషలిస్టు పార్టీ, ఎంఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో ఆరోగ్యశ్రీ సాధన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులతో కేకట్‌ చేయించారు. ఎంఎస్పీ తాండూరు నియోజకవర్గ ఇన్‌చార్జి పెద్దోళ్ల ఆనంద్‌కుమార్‌, నాయకులు డీఆర్‌.శ్రీకాంత్‌, పి.మహేష్‌, అశోక్‌, పి.వెంకటేష్‌, వై.మహేష్‌, బి.రమేష్‌, శ్రీనివాస్‌, కృష్ణ పాల్గొన్నారు.

Updated Date - 2022-08-08T05:52:47+05:30 IST