అటకెక్కిన ఆరోగ్యలక్ష్మి

ABN , First Publish Date - 2021-05-07T04:00:00+05:30 IST

అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహా రం అందించేందుకు ప్రవేశపెట్టిన ‘ఆరోగ్యలక్ష్మి’ పథకం సరుకుల లేమితో జిల్లాలో లక్ష్యం చేరడం లేదు. పథకంలో భాగంగా గర్భం దాల్చింది మొదలు పురు డు పోసుకొన్న తరువాత ఆర్నెళ్ల వరకు రోజులో ఒక్కపూట పౌష్టికాహారం అందించాల్సి ఉంది.

అటకెక్కిన ఆరోగ్యలక్ష్మి
జిల్లా కేంద్రంలోని అండాళమ్మ కాలనీలోగల అంగన్వాడీ కేంద్రం

గర్భిణులు, బాలింతలకు అందని పౌష్టికాహారం

అరకొర సరుకులతో నెట్టుకొస్తున్న అంగన్వాడీలు

ఐదు నెలలుగా పాలు, నూనె నో స్టాక్‌

బాలామృతం, గుడ్లదీ అదే పరిస్థితి

మంచిర్యాల, మే 6 (ఆంధ్రజ్యోతి): అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహా రం అందించేందుకు ప్రవేశపెట్టిన ‘ఆరోగ్యలక్ష్మి’ పథకం సరుకుల లేమితో జిల్లాలో లక్ష్యం చేరడం లేదు. పథకంలో భాగంగా గర్భం దాల్చింది మొదలు పురు డు పోసుకొన్న తరువాత ఆర్నెళ్ల వరకు రోజులో ఒక్కపూట పౌష్టికాహారం అందించాల్సి ఉంది.  రోజుకు ఒక్కొక్కరికి 1052.70 కాలరీలు, 32.8 గ్రాముల ప్రొటీ న్లు, 501.06 మి.గ్రాముల కాల్షియం అందించడం ద్వారా మహిళతోపాటు పుట్టబోయే బిడ్డ సంపూర్ణ ఆరో గ్యవంతుడిగా ఉండేలా పథకాన్ని రూపొందించారు. సాధారణ రోజుల్లో అంగన్‌వాడీ కేంద్రంలోనే పౌష్టికా హారం వండి  వడ్డించేవారు. ప్రస్తుతం కొవిడ్‌ కారణం గా సెంటర్లకు రానివ్వకుండా నెలకు సరిపడా బియ్యం, పప్పు, నూనె, పాలు, గుడ్లు, బాలామృతం ఇళ్లకే పంపు తున్నారు. అయితే అంగన్వాడీ కేంద్రాలకు సరుకులు సరఫరా కాకపోవడంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరక పోగా, నిరుపేదలైన గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందడం లేదు. 

సరుకుల లేమితో ఇబ్బందులు...

జిల్లాకు సంబంధించి మొత్తం 969 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వీటి పరిధిలో 4,733 మంది గర్భిణులు ఉండగా, 5,547 మంది పాలిచ్చే తల్లులు ఉన్నారు. అలాగే 0-6 నెలలలోపు వయస్సుగల పాలు తాగే పిల్లలు 5,658 మంది, 7 నెలల నుంచి ఒక సంవత్సరం లోపు పిల్లలు 4,695 మంది, 1 నుంచి 3 సంవత్సరాల లోపు 20,659, 3 నుంచి 6 సంవత్సరాల వయస్సుగల వారు 15,616 మంది ఉన్నారు. గర్భి ణులు, పాలిచ్చే తల్లులకు రోజు ఒక్కొక్కరికి 150 గ్రాముల బియ్యం, 30 గ్రాముల పప్పులు, 16 గ్రాము ల నూనె, 200 మిల్లీలీటర్ల పాలు, 50 గ్రాముల బరు వు ఉండే కోడి గుడ్డు, 50 గ్రాముల కూరగాయలు, పోపు దినుసులు ఇవ్వాల్సి ఉంది. 

అలాగే 7 నెలల నుంచి 3 సంవత్సరాలలోపు పిల్ల లకు బాలామృతం, గుడ్డు, ఇతర స్నాక్‌ ఇవ్వాల్సి ఉంది. అలాగే 3 నుంచి 6 సంవత్సరాల లోపు పిల్ల లకు 75 గ్రాముల బియ్యం, 15 గ్రాముల పప్పు, 5 గ్రాముల నూనె, ఒక గుడ్డు, పాలు ఇవ్వాలి. కొవిడ్‌ కారణంగా అందుబాటులో ఉన్న సరుకులను  లబ్ధిదారుల ఇళ్లకే పంపుతున్నారు. అయితే ప్రస్తుతం  కేంద్రాల్లో బియ్యం, పప్పు, కోడిగుడ్డు మినహా ఇతర సరుకులు అందుబాటులో లేవు. దీంతోలబ్ధిదారులు  ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం నుంచే సరు కుల సరఫరా కావడం లేదని కేంద్రం నిర్వాహకులు చెబుతున్నారు. 

పాలు, నూనె నో స్టాక్‌...

పాల ప్యాకెట్లు, తెలంగాణ ఆయిల్‌ ఫెడ్‌ నుంచి నూనెను ప్రభుత్వం నేరుగా కాంట్రాక్టర్ల ద్వారా అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తోంది. ఐదు నెలలుగా ఆ సరుకులు అందుబాటులో ఉండటం లేదు. అలాగే బాలామృతం మూడు నెలలుగా సరఫరా కావడం లేదని నిర్వాహకులు చెబుతున్నారు. దీంతో మిగిలిన సరుకులనే గర్భిణులు, బాలింతలకు అందజేస్తున్నారు. అంగన్వాడీలో సరుకులు సక్రమంగా ఇవ్వడం లేదని, సెంటర్‌కు వెళ్లినప్పుడల్లా కొన్ని కొన్ని ఇస్తున్నారని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. గుడ్లు కూడా సరిపడా సరఫరా కాకపోవడంతో విడుతల వారీగా సెంటర్లకు పంపిణీ చేస్తున్నారు. దీంతో సరు కులు వచ్చినప్పుడల్లా టీచర్లు ఫోన్లు చేస్తండటంతో రెండు మూడుసార్లు సెంటర్లకు వెళ్లాల్సి వస్తుందని గర్భిణులు, బాలింతలు వాపోతున్నారు. 

సరుకులు సక్రమంగా రావడం లేదు

జిల్లా సంక్షేమశాఖ అధికారిణి ఉమాదేవి

అంగన్‌వాడీ కేంద్రాలకు పంపిణీ చేసేందుకు పాలు, నూనె హైద్రాబాద్‌ నుంచే పంపిణీ లేదు. నిర్ణ యించిన ధరలకు సరుకులు పంపిణీ చేసేందుకు కాం ట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. బాలామృతం స్టాకు రావడంతో కేంద్రాలకు పంపిణీ చేయడం జరి గింది. కోడిగుడ్ల సరఫరా విడుతల వారీగా జరిగినా లబ్ధిదారులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేప డుతున్నాం. త్వరలో పూర్తిస్థాయిలో సరుకులను అం గన్‌వాడీ కేంద్రాల్లో అందుబాటులో ఉంచేందుకు కృషి చేస్తాం. 

Updated Date - 2021-05-07T04:00:00+05:30 IST