జగనన్నా.. నాకు న్యాయం చేయండి: ఆర్మీ జవాను
ABN , First Publish Date - 2021-07-11T18:08:44+05:30 IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనకు న్యాయం చేయాలంటూ ఆర్మీ జవాను విజ్ఞప్తి చేశారు.
ఇంటర్నెట్: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనకు న్యాయం చేయాలంటూ ఇండియన్ రిజర్వ్ బెటాలియన్ నార్త్‌లో పనిచేస్తున్న ఆర్మీ జవాన్ అసిర రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన ఓ వీడియో పోస్టు చూశారు. తనది శ్రీకాకుళం జిల్లా, పోలక్ మండలమని చెప్పారు. తన కుటుంబం స్వస్థలంలో ఉన్నారని తెలిపారు. అయితే తన తండ్రి చనిపోయిన తర్వాత ఉన్న ఆస్తి అంతా తన అన్నయ్య స్వాధీనం చేసుకున్నాడని, ఎందుకు ఇలా చేశావని ప్రశ్నిస్తే.. ఇక్కడ నీకేం హక్కుందని అన్నాడని, తన భార్య, పిల్లలపై దాడి చేశారని తెలిపారు. దీంతో వారు పోలక్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే.. అక్కడ కూడా న్యాయం జరగలేదని అసిర రెడ్డి చెప్పారు. అందుకే సోషల్ మీడియాలో తన సమస్యను వీడియో ద్వారా పోస్టు చేస్తున్నానని అన్నారు. ప్రజలు తనకు మద్దతు తెలపాలని, ఈ సమస్యను సీఎం దృష్టికి వెళ్లేలా చేయాలని, తనకు న్యాయం జరిగేలా చూడాలని ఆయన కోరారు.