తమిళనాడులో కూలిన ఆర్మీ హెలికాప్టర్, సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ ఉన్నట్లు అనుమానం!

ABN , First Publish Date - 2021-12-08T19:15:45+05:30 IST

బుధవారం అత్యంత దారుణం జరిగింది. ఓ ఆర్మీ

తమిళనాడులో కూలిన ఆర్మీ హెలికాప్టర్, సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ ఉన్నట్లు అనుమానం!

చెన్నై : బుధవారం అత్యంత దారుణం జరిగింది. ఓ ఆర్మీ హెలికాప్టర్ తమిళనాడులోని కూనూరులో కుప్పకూలింది. ఈ హెలికాప్టర్‌లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం ఈ హెలికాప్టర్లో నలుగురు ప్రయాణిస్తున్నారని సమాచారం. ముగ్గురిని కాపాడినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఈ ముగ్గురికీ తీవ్ర గాయాలయ్యాయని, నాలుగో వ్యక్తి కోసం గాలింపు జరుగుతోందని తెలుస్తోంది. గాయపడినవారిని నీలగిరి జిల్లాలోని వెల్లింగ్టన్ కంటోన్‌మెంట్ ఆసుపత్రికి తరలించారు. 




Updated Date - 2021-12-08T19:15:45+05:30 IST