ఎస్సై పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు

ABN , First Publish Date - 2022-08-07T04:28:58+05:30 IST

ఎస్సై ప్రిలిమినరీ రాత పరీక్షల నిర్వహణకు పక డ్బందీ ఏర్పాట్లు చేశా మని డీసీపీ అఖిల్‌ మహాజన్‌ తెలిపారు. శనివారం జిల్లా కేంద్రం లోని పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని, బయో మెట్రిక్‌ విధానంతో పారదర్శకంగా పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు.

ఎస్సై పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
పరీక్ష కేంద్రాన్ని పరిశీలిస్తున్న డీసీపీ అఖిల్‌ మహజన్‌

ఏసీసీ, ఆగస్టు 6: ఎస్సై ప్రిలిమినరీ రాత పరీక్షల నిర్వహణకు పక డ్బందీ ఏర్పాట్లు చేశా మని డీసీపీ అఖిల్‌ మహాజన్‌ తెలిపారు. శనివారం జిల్లా కేంద్రం లోని పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని, బయో మెట్రిక్‌ విధానంతో పారదర్శకంగా పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 4 వరకు పరీక్ష కేంద్రాల సమీపంలో జిరాక్సు, ఇంటర్‌నెట్‌ సెంటర్లు మూసి ఉంచాలని ఆదేశించారు. చుట్టుపక్కల లౌడ్‌ స్పీకర్లను వాడవ ద్దని సూచించారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి గంట ముందే చేరుకోవాలన్నారు. ఎస్సై తహసినోద్దీన్‌ ఉన్నారు.  

దళారులను నమ్మి మోసపోవద్దు  

ఎస్సై, పోలీసు కానిస్టేబుల్‌ ఉద్యోగాల కోసం దళారులను ఆశ్రమించి మోసపో వద్దని రామగుండం ఇన్‌చార్జి సీపీ సత్యనారాయణ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పోలీసు ఉద్యోగాలు ఇప్పిస్తామంటే నమ్మవద్దన్నారు. అధునాతన టెక్నాలజీ ఉపయోగించి పరీక్షలు నిర్వహిస్తున్నందున పూర్తి పారదర్శకంగా ఉం టుందన్నారు. ప్రలోభాలకు గురి కావద్దని, మెరిట్‌ ఆధారంగానే నియామకం జరుగుతుందన్నారు. ఎవరైనా మోసపూరిత ప్రయత్నాలు చేస్తే అనర్హులుగా ప్రకటించి  కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.  

Updated Date - 2022-08-07T04:28:58+05:30 IST