వైభవంగా ఆదిత్యుని కల్యాణం

ABN , First Publish Date - 2020-07-17T10:21:13+05:30 IST

ఆషాడ బహుళ ఏకాదశి పురస్కరించుకొని అరసవల్లి సూర్యనారాయణ స్వామి కల్యాణం వైభవంగా నిర్వహించారు. ప్రధానార్చకులు ఇప్పిలి ..

వైభవంగా ఆదిత్యుని కల్యాణం

శ్రీకాకుళం కల్చరల్‌: ఆషాడ బహుళ ఏకాదశి పురస్కరించుకొని అరసవల్లి సూర్యనారాయణ స్వామి కల్యాణం వైభవంగా నిర్వహించారు. ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో ఉదయం 8 గంటలకు స్వామి కల్యాణ ఉత్సవమూర్తులను అర్చకులు అనివెట్టి మండపంలో వేంచేయించి సుగంధ సువర్ణ పుష్పాలతో అలంకరించారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి కల్యాణం వైభవంగా నిర్వహించారు.  అర్చకులు నగేష్‌కశ్యప, రంజిత్‌శర్మ, ఫణీంద్రశర్మ, దర్భముళ్ల శ్రీనివాసశర్మ, సాందీప్‌శర్మ, కిరణ్‌శర్మ, మూర్తి, వేదపండితులు, ఆలయ సూపరింటెండెంట్‌ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. ఫ గురువారం వేకు వజామున స్వామికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ, ఆలయ ఈవో వి.హరిసూర్యప్రకాష్‌ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరి గింది.  కరోనా కారణంగా భక్తులను అనుమతించలేదు. 


వేణుగోపాలునికి పంచామృతాభిషేకం

గార: ఏకాదశి సందర్భంగా శ్వేతగిరిపై కొలువైన వేణుగోపాలస్వామికి గురువారం పంచామృతాభిషేకం నిర్వహించారు. పుష్పాలంకరణ సేవ, తులసి సహస్రనామార్చన, నీరజాన మంత్రపుష్పం సమర్పించారు. ట్రస్ట్‌ బోర్డు అధ్య క్షులు సుగ్గు మధురెడ్డి, లక్ష్మీనరసింహదేవి దంపతులు ఆధ్వర్యంలో పూజలు జరిగాయి. కరోనా కారణంగా భక్తులను అనుమతించలేదు.


భక్తిశ్రద్ధలతో కర్కాటక సంక్రమణ పూజలు

కవిటి: కవిటిలో చింతామణి, జగతిలో మర్లపోలమ్మ, బొరివంకలో కాళీమాత ఆలయాల్లో గురువారం భక్తిశ్రద్ధలతో కర్కాటక సంక్రమణ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా  మహిళలు కుంకుమ పూజలు చేశారు. కరోనా వైరస్‌ తగ్గాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

Updated Date - 2020-07-17T10:21:13+05:30 IST