అరక్కోణం మార్గంలో 6 విద్యుత్‌ లోకల్‌ రైళ్ల రద్దు

ABN , First Publish Date - 2022-05-31T15:36:20+05:30 IST

చెన్నై - అరక్కోణం మార్గంలో ఈ నెల 31, జూన్‌ ఒకటో తేదీలలో మరమ్మతు పనుల కారణంగా ఆరు విద్యుత్‌ రైళ్లను రద్దుచేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఉదయం

అరక్కోణం మార్గంలో 6 విద్యుత్‌ లోకల్‌ రైళ్ల రద్దు

చెన్నై: చెన్నై - అరక్కోణం మార్గంలో ఈ నెల 31, జూన్‌ ఒకటో తేదీలలో మరమ్మతు పనుల కారణంగా ఆరు విద్యుత్‌ రైళ్లను రద్దుచేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఉదయం పదిగంటలకు బయలుదేరే అరకోణం - చెన్నై రైలు,  ఉదయం 10.15 గంటలకు బయల్దేరే తిరుత్తణి - చెన్నై రైలు, 11.10 గంటలకు బయలుదేరే అరక్కోణం - తిరుత్తణి రైలు రద్దు చేయనున్నట్లు పేర్కొరన్నారు. ఇదవిధంగా మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరే అరక్కోణం - చెన్నై రైలు, 12.35 గంటలకు బయలుదేరే తిరుత్తణి - చెన్నై రైలు, 1.30-గంటలకు బయలుదేరే అరక్కోణం - చెన్నై రైలును రద్దు చేస్తున్నట్లు తెలిపారు.

Updated Date - 2022-05-31T15:36:20+05:30 IST