Abn logo
Feb 22 2020 @ 02:30AM

పర్దాపై నా కూతురికి స్వేచ్ఛనిచ్చాం: రెహ్మాన్‌

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: తన కుమార్తె ఖతీజ, స్త్రీవాద రచయిత్రి తస్లీమా నస్రీన్‌ల మధ్య నడుస్తున్న పర్దా వివాదంపై ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహ్మాన్‌ తొలిసారి స్పందించారు. ‘‘ఏది మంచో, ఏది చెడో తెలుసుకునేవిధంగా మా పిల్లలను పెంచాము. వాళ్ల ఇష్టప్రకారం నడుచుకునేలా స్వేచ్ఛనిచ్చాము’’ అని ఆయన స్పష్టంచేశారు. ఖతీజ బుర్ఖా వేషధారణ తనకు బాధ కలిగిస్తోందని తస్లీమా వ్యాఖ్యా నించడంతో ఈ వివాదం చెలరేగింది. 

Advertisement
Advertisement
Advertisement