Abn logo
Nov 29 2020 @ 23:21PM

బదిలీలకు అన్ని ఖాళీలను చూపాలి

ఏపీటీఎఫ్‌ నేతల డిమాండ్‌


గుంటూరు, నవంబరు 29: ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి అన్ని ఖాళీలను చూపాలని ఏపీ టీచర్స్‌ ఫెడరేషన్‌ జిల్లాశాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.బసవలింగారావు, సయ్యద్‌ చాంద్‌బాషా ఆదివారం ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశారు. జిల్లాలో మొత్తం 2,415 సెకండరీ గ్రేడ్‌ టీచర్స్‌ ఖాళీలుంటే కౌన్సెలింగ్‌కు కేవలం 1,640 ఖాళీలు చూపి మిగిలిన 775 ఖాళీలను బ్లాక్‌ చేశారని తెలిపారు. మాన్యువల్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించాలని లేకుంటే పెద్దఎత్తున ఆందోళన నిర్వహిస్తామని పేర్కొన్నారు.  

Advertisement
Advertisement
Advertisement