నిరుద్యోగులను విస్మరిస్తే తగిన శాస్తి తప్పదు

ABN , First Publish Date - 2022-01-29T05:44:21+05:30 IST

ఓట్లు వేయించుకుని అధికారం చేపట్టిన తర్వాత నిరుద్యోగ యు వతను విస్మరిస్తే తగిన శాస్తి తప్పదని విద్యార్థి, యువ జనసంఘాలు హెచ్చరించారు.

నిరుద్యోగులను విస్మరిస్తే తగిన శాస్తి తప్పదు
టవర్‌క్లాక్‌ వద్ద విద్యార్థి, యువజన సంఘాల నాయకుల భిక్షాటన

ఖాళీల భర్తీకి నోటిఫికేషన ఇవ్వాలి

ఉద్యోగ విరమణ  వయసు పెంపును ఉపసంహరించుకోవాలి

 భిక్షాటనతో విద్యార్థి, యువజన సంఘాల నిరసన

అనంతపురం క్లాక్‌టవర్‌, జనవరి 28: ఓట్లు వేయించుకుని అధికారం చేపట్టిన తర్వాత నిరుద్యోగ యు వతను విస్మరిస్తే తగిన శాస్తి తప్పదని విద్యార్థి, యువ జనసంఘాలు హెచ్చరించారు. రాష్ట్రప్రభుత్వం ఉద్యోగుల పదవీవిరమణ వయస్సు పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, ఖాళీల భర్తీకి వెంటనే నోటిఫికేషన ఇవ్వాలని డి మాండ్‌ చేస్తూ శుక్రవారం విద్యార్థి, యువజనసంఘాల నాయకులు స్థానిక టవర్‌క్లాక్‌ వద్ద భిక్షాటన చేస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఏఐఎ్‌సఎఫ్‌ రాష్ట్ర కార్యవర్గసభ్యులు మనోహర్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేంద్రప్రసాద్‌, ఏఐవైఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి సంతో్‌షకుమార్‌, ఎస్‌ఎ్‌ఫఐ జిల్లా కార్యదర్శి సూర్యచంద్ర, ఏఐఎ్‌సఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు చిరంజీవి, టీఎనఎ్‌సఎ్‌ఫ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి పరుశురామ్‌, జిల్లా అధ్యక్షుడు ధనుంజయనాయుడు, పీడీఎ్‌సయూ జిల్లా కార్యదర్శి వీరేంద్ర, తెలుగుయువత శివ మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థికశాఖ నివేదిక ప్రకారం రాష్ట్రంలో 2.40లక్షల పోస్టులు ఖాళీలు ఉన్నాయన్నారు. సీఎం జగన కేవలం 10వేల పోస్టులతో జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేసి నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారన్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగ యువత ఆత్మహత్య చేసుకుంటున్నా వైసీపీ ప్రభుత్వానికి పట్టదా అని ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1.34 లక్షల మంది  సచివాలయ ఉద్యోగులకు ప్రొబెషనరీ ప్రకటించి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు ఆనంద్‌, సహాయ కార్యదర్శి రాము, నగర కార్యదర్శి మోహనకృష్ణ, ఏఐఎ్‌సఎఫ్‌ నగర అధ్యక్ష, కార్యద ర్శులు నరేష్‌, రమణయ్య, నాయకులు అస్ర్‌ఫ అలీ, మహేష్‌, మోహన, ఆనంద్‌, ఈశ్వర్‌, వినయ్‌, శ్రీకాంత తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-01-29T05:44:21+05:30 IST