అర్జీలు పెండింగ్‌లో లేకుండా చూడాలి

ABN , First Publish Date - 2022-05-17T06:21:26+05:30 IST

సమస్యల పరిష్కారం కోసం మారుమూల గ్రామా ల నుంచి వచ్చే ప్రజల అర్జీలు పెండింగ్‌లో లేకుండా చూడాలని కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్‌ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల విభాగంలో ఆమె ప్రజల నుంచి

అర్జీలు పెండింగ్‌లో లేకుండా చూడాలి
కలెక్టర్‌కు వినతిపత్రం ఇస్తున్న దివ్యాంగులు

ఫిర్యాదులను స్వీకరించిన కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌

ఆదిలాబాద్‌ టౌన్‌, మే 16: సమస్యల పరిష్కారం కోసం మారుమూల గ్రామా ల నుంచి వచ్చే ప్రజల అర్జీలు పెండింగ్‌లో లేకుండా చూడాలని కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్‌ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల విభాగంలో ఆమె ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. వారి సమస్యలను ఓప్పిగ్గా విన్న కలెక్టర్‌ పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు అందించారు. జిల్లాలోని సుదూర ప్రాంతాల నుంచి ఎంతో నమ్మకంతో వచ్చే ప్రజల అర్జీలను పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు. ప్రతీ సోమవారం జిల్లాస్థాయి అధికారులు విధిగా ఫిర్యాదుల విభాగానికి హాజరు కావాలన్నారు.

‘కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి’

జొన్న పంట చేతికొచ్చ 25 రోజులైన ఇప్పటి వరకు ప్రభుత్వ వ్యవసాయ అధికారులు కేంద్రాలు ఏర్పాటు చేయలేదని, జూన్‌లో వానాకాలం సీజన్‌ మొదలవుతుందని రైతులు పండించిన జొన్నలు వెంటనే కొనుగోలు జరిపించాలని ఏఐసీసీ సభ్యురాలు గండ్రత్‌ సుజాత కలెక్టర్‌కు వినతి పత్రం అందించారు. స్పందించిన కలెక్టర్‌ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. 

‘దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలి’

దివ్యాంగుల కాలనీ ఏర్పాటు కోసం 2014 నుంచి అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టు తిరుగుతున్న ఎలాంటి స్పందన రావడం లేదని దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక అధ్యక్షుడు ఇమ్రాన్‌ అన్నారు. సోమవారం ఎన్‌పీఆర్‌డీ ఆధ్వర్యంలో కలెక్టర్‌ సమావేశ మందిరం ఎదుట దివ్యాంగులతో కలిసి ఆందోళన చేపట్టా రు. ఆర్డీవో రాజేశ్వర్‌ వచ్చి వారి సమస్యలను తెలుసుకున్నారు. కలెక్టర్‌ వచ్చే వరకు తాము ఇక్కడి నుంచి కదలమని పట్టుబట్టారు. చివరకు కలెక్టర్‌కు సమస్యను విన్నవించి ఉద్యమాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఇందులో కైలాస్‌, శకీర్‌, సత్యనారాయణ, జియ ఉర్రాహ్మన్‌, సజీద్‌, తదితరులున్నారు.

Updated Date - 2022-05-17T06:21:26+05:30 IST