సీఎస్‌ఐఆర్‌ పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం

ABN , First Publish Date - 2021-05-12T06:05:56+05:30 IST

ఇంటర్మీడియట్‌ వరకు చదివే బాల బాలికలకు భార త ప్రభుత్వ సీఎస్‌ఐఆర్‌ ఇన్నోవేషన్‌ అవార్డు ఫర్‌ స్కూల్‌ చిల్డ్రన్‌ పురస్కా రాలను అందజేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు డీఈవో సీవీ రేణుక తెలిపారు.

సీఎస్‌ఐఆర్‌ పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం

ఏలూరుఎడ్యుకేషన్‌, మే 11: ఇంటర్మీడియట్‌ వరకు చదివే బాల బాలికలకు భార త ప్రభుత్వ సీఎస్‌ఐఆర్‌ ఇన్నోవేషన్‌ అవార్డు ఫర్‌ స్కూల్‌ చిల్డ్రన్‌ పురస్కా రాలను అందజేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు డీఈవో సీవీ రేణుక తెలిపారు. బయోటెక్నాలజీ/ బయాలజి, కెమికల్‌, ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ విభాగాల్లో ఈ పురస్కారాలు ఉంటాయని వివరించారు. అవార్డు గ్రహీతలకు నగదు ప్రోత్సాహక బహుమతులు అందజేస్తారన్నారు. పూర్తి వివరాలు www.csir.res.in వెబ్‌సైట్‌ నుంచి పొందవచ్చునన్నారు. దరఖాస్తులను అందజేసేందుకు ఈ నెల 31వ తేదీ తుది గడువు అని వివరించారు.


Updated Date - 2021-05-12T06:05:56+05:30 IST