యాప్‌ డౌన్‌లోడ్‌ ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలి

ABN , First Publish Date - 2022-08-19T04:55:53+05:30 IST

ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజనపథకం తదితర వివరాలు అప్‌లోడ్‌కు సంబంధించి సొంత మొబైళ్లలో డౌన్‌లోడ్‌ చేయాలని ఇచ్చిన ఉత్తర్వులను తక్షణం ఉపసంహ రించుకోవాలని ఫ్యాఫ్టో కమిటీ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు జలుమూరు, ఎల్‌ఎన్‌పేటల్లో గురువారం ఎంఈవోలు బి.మాధవరావు, శ్రీనివాస రావులకు వినతిపత్రం అందించారు.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలి

జలుమూరు/ఎల్‌ఎన్‌పేట: ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజనపథకం తదితర వివరాలు అప్‌లోడ్‌కు సంబంధించి సొంత మొబైళ్లలో డౌన్‌లోడ్‌ చేయాలని ఇచ్చిన ఉత్తర్వులను తక్షణం ఉపసంహ రించుకోవాలని ఫ్యాఫ్టో కమిటీ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు జలుమూరు, ఎల్‌ఎన్‌పేటల్లో గురువారం ఎంఈవోలు బి.మాధవరావు, శ్రీనివాస రావులకు వినతిపత్రం అందించారు. వినతి పత్రాలు అందించిన వారిలో ఏపీటీఎఫ్‌, పీఆర్టీ యూ మండల అధ్యక్షులు మెండ రామారావు,  గణపతిరావు, యూటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి జి. రాము, మన్మఽథ కుమార్‌మిశ్రో, జి.శ్రీరామచంద్రమూర్తి, ఎస్‌.రమణమూర్తి పాల్గొన్నారు.

 

Updated Date - 2022-08-19T04:55:53+05:30 IST