అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ అసానుద్దీన్ అమానుల్లా ప్రమాణ స్వీకారం చేశారు. ఆదివారం ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానంలోని మొదటి కోర్టు హాల్లో పాట్నా హైకోర్టు నుండి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు న్యాయమూర్తిగా బదిలీపై వచ్చిన జస్టిస్ అసానుద్దీన్ అమానుల్లాచే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరుప్ కుమార్ గోస్వామి ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తితో పాటు ఇతర న్యాయమూర్తులు, అడ్వకేట్ జనరల్ శ్రీరాం, పలువురు రిజిస్ట్రార్‌లు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.