గ్రేడులు, మార్కులు లేనట్టే.. పది ఫలితాలపై ఏపీ సర్కారు కొత్త ఆలోచన..!

ABN , First Publish Date - 2020-07-10T20:19:30+05:30 IST

గ్రేడులు, మార్కులతో నిమిత్తం లేకుండా పదో తరగతి ఫలితాలను ‘పాస్‌’గా ప్రకటించాలని విద్యాశాఖ యోచిస్తున్న ట్లుగా తెలిసింది. దీనిపై వారం రోజుల్లోగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

గ్రేడులు, మార్కులు లేనట్టే.. పది ఫలితాలపై ఏపీ సర్కారు కొత్త ఆలోచన..!

గ్రేడులు, మార్కులు లేనట్టే..!

పది విద్యార్థులకు ‘పాస్‌’తో సరి

పైతరగతుల్లోకి ప్రవేశించేందుకు అడ్మిషన్‌ టెస్టులు ?

విద్యాశాఖ పరిశీలనలో ప్రతిపాదన 


ఏలూరు(పశ్చిమ గోదావరి జిల్లా): గ్రేడులు, మార్కులతో నిమిత్తం లేకుండా పదో తరగతి ఫలితాలను ‘పాస్‌’గా ప్రకటించాలని విద్యాశాఖ యోచిస్తున్న ట్లుగా తెలిసింది. దీనిపై వారం రోజుల్లోగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. జిల్లాలో టెన్త్‌ పరీక్షలకు మొత్తం 50,027 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో రెగ్యులర్‌ విద్యార్థులు 49,039 మంది, వన్స్‌ ఫెయిల్డ్‌ 988 మంది ఉన్నారు. కరోనా కారణంగా ఈ ఏడాది పదో తరగతి పరీక్షలను రద్దుచేసిన విషయం విధితమే. ఈ క్రమంలో ఫలితాలను ఫార్మేటివ్‌,సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌ పరీక్షల్లో విద్యార్థి సాధించిన మార్కులను క్రోడీకరించి నిర్ణీత ఫార్ములా ద్వారా గ్రేడ్లు, మార్కులను ప్రకటిస్తారని ఇప్పటివరకూ అంతా భావి స్తున్నారు. ఫార్మేటివ్‌, సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌ మార్కులను సీఎస్‌ఈ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ చేయని విద్యార్థుల మార్కులను అప్‌లోడ్‌ చేయడానికి విద్యాసంస్థలకు ఇటీవల అవకాశం కల్పించారు. అయితే పలుచోట్ల విద్యాసంస్థలు డబ్బులు వసూలు చేసి అడ్డకోలుగా గరిష్టస్థాయిలో మార్కులు నమోదు చేస్తున్నాయన్న ఆరోపణలు వచ్చాయి. ఇలాంటి పద్ధతుల వల్ల ప్రతిభగల విద్యార్థులకు అన్యాయం జరుగు తుం దన్న ఆందోళన విద్యార్థులు, తల్లిదండ్రుల్లోనూ వ్యక్తమవుతోంది. వీటన్నిం టిని పరిగణనలోకి తీసుకున్న విద్యాశాఖ గ్రేడులు, మార్కులతో సంబంధం లేకుండా ‘ఆల్‌ పాస్‌’ విధానమే ఉత్తమమని భావిస్తున్నట్లు సమాచారం. లేదంటే లాటరీ తీసి ఫలితాలు ఇచ్చేలా కూడా ఆలోచన చేస్తున్నారు.


సామర్థ్యానికి పరీక్ష.. 

గ్రేడులు, మార్కులతో సంబంధం లేకుండా అందరూ ఉత్తీర్ణులేనని విద్యాశాఖ తుది నిర్ణయం తీసుకుంటే తదుపరి పైతరగతుల్లోకి ప్రవేశించే విద్యార్థుల ప్రతిభ సామర్థ్యాలకు ప్రామాణికమేమిటన్న సందేహాలకు కూడా విద్యాశాఖ పరిష్కారం చూపిస్తోంది. టెన్త్‌ పూర్తయిన తరువాత సహజంగా ఇంటర్మీడియట్‌ కోర్సుల్లోకి అత్యధికులు ప్రవేశిస్తారు. మరికొందరు పాలిటెక్నిక్‌, ఐటీఐ, ట్రిఫుల్‌ ఐటీ, ఎపీఆర్‌.జేసీ వంటి విద్యా సంస్థల్లోకి అడుగు పెడతారు. పాలిటెక్నిక్‌, ఎపీఆర్‌జేసీ ప్రవేశాలకు ఎంట్రన్స్‌ టెస్ట్‌లో చూపిన ప్రతిభ ఆధారంగా అడ్మిషన్లు ఇస్తున్నందున ఎటువంటి సమస్యలు తలెత్తవు. ఇక ఐటీఐ, ట్రిపుల్‌ఐటీ, ఇంటర్మీడియట్‌ కోర్సుల్లో ప్రవేశాలకు చిన్నపాటి అడ్మిషన్‌ టెస్టు నిర్వహించుకునేందుకు అనుమతి ఇస్తే విద్యార్థుల సామర్థ్యాలకు అను గుణంగా సంబంధిత కోర్సుల్లో అడ్మిషన్లు లభిస్తాయి. 

Updated Date - 2020-07-10T20:19:30+05:30 IST