ఏపీలో 68 డివిజన్లలో మోగిన పంచాయితీ ఎన్నికల నగారా

ABN , First Publish Date - 2021-01-23T17:54:51+05:30 IST

ఏపీలో పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్‌ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్ శనివారం ఉదయం విడుదల చేశారు.

ఏపీలో 68 డివిజన్లలో మోగిన పంచాయితీ ఎన్నికల నగారా

విజయవాడ: ఏపీలో పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్‌ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్ శనివారం ఉదయం విడుదల చేశారు. 68 డివిజన్లలో నాలుగు‌ విడతలుగా 659 మండలాల్లో పంచాయితీ ఎన్నికల నగారా మోగింది. ఉదయం 6:30 గంటల నుంచి మధ్యాహ్నం 3:30 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. అదే రోజు సాయంత్రం నాలుగు గంటల తర్వాత లెక్కింపు, ఫలితాలను విడుదల చేయనున్నారు.

 

ఎన్నికల తేదీలు:

* ఫిబ్రవరి 5 తొలి విడతలో 14డివిజన్లలో 146 మండలాల్లో పంచాయితీ ఎన్నికలు

* ఫిబ్రవరి 9న రెండో‌ విడతలో  17 డివిజన్లలో 173 మండలాలు

* ఫిబ్రవరి 13న మూడో విడతలో 18 డివిజన్లలో  169మండలాలు

* ఫిబ్రవరి 17న నాలుగో‌ విడతలో‌ 19 డివిజన్లలో 171మండలాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. 


మొదటి విడత రెవెన్యూ డివిజన్లు, మండలాల వివరాలు:

1. శ్రీకాకుళం 

రెవెన్యూ డివిజన్ : శ్రీకాకుళం

మండలాలు : ఎచ్చెర్ల, జి.సిగడం, రణస్ధలం, గార, శ్రీకాకుళం, నరసన్నపేట, పోలాకి 

రెవెన్యూ డివిజన్ : టెక్కలి 

మండాలాలు : జలుమూరు 

రెవెన్యూ డివిజన్ : పాలకొండ 

మండలాలు : సరవకోట

2. విశాఖపట్నం

రెవెన్య డివిజన్ : విశాఖపట్నం 

మండలాలు : భీమునిపట్నం, పద్మనాభం, ఆనందపురం, పెందుర్తి, సబ్బవరం, పరవాడ

3. తూర్పు గోదావరి జిల్లా

అమలాపురం డివిజన్‌లో మండలాలు...అయినవిల్లి, ఆళ్లవారం, అమలాపురం, అంబాజీపేట, ఆత్రేయపురం, ఐ.పోలవరం, కాట్రేనకోన, కొత్తపేట, మలికిపురం, మామిడికుదరు, ముమ్మిడివరం, పి.గన్నవరం, రావులపాలెం, రాజోలు, సఖనేటిపల్లి, ఉప్పలగుప్తం

4. పశ్చిమ గోదావరి జిల్లా: ఏలూరు  డివిజన్

5. కృష్ణా జిల్లా: నూజివీడు డివిజన్

6. గుంటూరు జిల్లా: గుంటూరు డివిజన్‌

7. నెల్లూరు జిల్లా:  నెల్లూరు డివిజన్ 

8. కర్నూలు జిల్లా: ఆదోని రెవెన్యూ డివిజన్‌

9. అనంతపురం జిల్లా: పెనుకొండ రెవెన్యూ డివిజన్ 

10. వైఎస్‌ఆర్ జిల్లా: జమ్మలమడుగు రెవెన్యూ డివిజన్‌కు, కడప డివిజన్‌లో చక్రాయపేట, యర్రగుంట్ల 

11. చిత్తూరు జిల్లా: తిరుపతి రెవెన్యూ డివిజన్‌లో మొదటి విడత ఎన్నికలు జరుగనున్నాయి. 

Updated Date - 2021-01-23T17:54:51+05:30 IST