ప్రకాశం: అమరావతి ఉద్యమం ప్రారంభమై 700వ రోజు సందర్భంగా మహాపాదయాత్రలో సర్వమత ప్రార్ధనలు నిర్వహించారు. అన్ని మతాల ప్రతినిధులు హాజరై ప్రార్థనలు చేస్తున్నారు. అమరావతి ఉద్యమంలో అమరులైన 189 రైతులకు జేఏసీ నేతలు నివాళులు అర్పించి మౌనం పాటించించారు. అనంతరం అమరావతి లక్ష్య సాధనకు ప్రతిజ్ఞ చేసిన రాజధాని రైతులు అమరావతి సంకల్పాన్ని చేపట్టారు. అమరావతి ఉద్యమ గీతాలాపనలతో పదహారవ రోజు పాదయత్ర ప్రారంభమైంది.