మళ్లీ మొదలైన వర్షాలు

ABN , First Publish Date - 2020-10-19T10:50:58+05:30 IST

మళ్లీ మొదలైన వర్షాలు

మళ్లీ మొదలైన వర్షాలు

ఏలూరు సిటీ, అక్టోబరు 18 : బంగాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా జిల్లాలో భారీ వర్షాలు మళ్లీ మొదలయ్యాయి. ఐదు రోజుల పాటు కుంభవృష్టిగా కురిసిన వర్షాలకు వాగులు, కాల్వలు పొంగి వరదలు సంభవిం చాయి. ఇప్పటికీ పలు ప్రాంతాలు వరద నీటి లోనే మునిగి తేలుతున్నాయి. పంట పొలాల్లో నీరు లాగడం లేదు. ఫలితంగా ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ వర్షాలు కురుస్తుండటంతో ఈసారి ఏమవుతుందోనని అందరిలోనూ ఆందోళన మొదలైంది. ఆదివారం చాలా ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. జనజీవనం స్తంభించడంతో పాటు వ్యవసాయ, ఉద్యాన పంటలు తీవ్ర నష్టాలు ఎదురవుతున్నాయి. గడచిన 24 గంటల్లో అత్యధికంగా ద్వారకా తిరుమల మండలంలో 45.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జిల్లా సరాసరి వర్షపాతం 10.1 మి.మీ. కాగా మొత్తం వర్షపాతం 485.4 మి.మీ నమోదైంది. పోడూరు 38.6, గోపాల పురం 38.4, అత్తిలి 34.2, యలమంచిలి 30, భీమడోలు 27.6, పెరవలి 26.4, మొగల్తూరు 21.8, పాలకొల్లు 20.2, నిడదవోలు 20, గణపవరం 17, చింతలపూడి 16.2, నరసాపురం 16, తణుకు 15.8, వీరవాసరం 13.6, నల్లజర్ల 12.2, దేవరపల్లి 10.6 మి.మీ. వర్షపాతం నమోదైంది.

Updated Date - 2020-10-19T10:50:58+05:30 IST