మరణ మృదంగం

ABN , First Publish Date - 2020-09-21T09:47:29+05:30 IST

మరణ మృదంగం

మరణ మృదంగం

 (ఆంధ్రజ్యోతి, విజయవాడ) 

జిల్లాలో కరోనా మరణాలు ఆగడం లేదు. రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పోలిస్తే పాజిటివ్‌ కేసులు తక్కువగానే ఉంటున్నప్పటికీ.. మరణాలు ఎక్కువగానే నమోదవుతున్నాయి. ఇటీవల ఈ సంఖ్య పెరుగుతోంది. ఆదివారం ఒక్కరోజే ఎనిమిది మంది కరోనా బాధితులు మరణించారు. జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు కూడా 25 వేలకు చేరువగా ఉన్నాయి. ఆదివారం ఒక్కరోజే కొత్తగా 439 మంది కరోనా బారిన పడ్డారు. ఈ కొత్త కేసులతో కలిపి జిల్లాలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసులు 24,030కి చేరుకున్నాయి. కరోనా మరణాలు అధికారికంగా 389కి పెరిగాయి. కొవిడ్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల్లో 356 మంది వ్యాధి నుంచి కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. మరో 3,037 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇంకా వేల మంది బాధితులు ఇళ్లలోనే (హోం ఐసోలేషన్‌) ఉండి చికిత్స పొందుతున్నారు. జిల్లాలో కరోనా మళ్లీ కల్లోలం సృష్టిస్తుండటంతో జిల్లా అధికార యంత్రాంగం మళ్లీ కట్టడి చర్యలు చేపడుతోంది. ఆదివారం కొత్తగా మరో ఎనిమిది గ్రామాల్లో కంటైన్మెంట్‌ జోన్లను ప్రకటించింది. బాపులపాడు మండలంలోని మడిచెర్ల, ఉమామహేశ్వరపురం, బండారుగూడెం, కోడూరు మండంలోని లింగారెడ్డిపాలెం, మచిలీపట్నం మండలంలోని నేలకుర్రు, ముసునూరు మండంలోని చిల్లబోయినపల్లి, పెడనలోని జింజేరు, రెడ్డిగూడెం మండలంలోని నాగులూరు గ్రామాల్లో కంటైన్మెంట్‌ నిబంధనలు అమలు చేస్తున్నారు. 

Updated Date - 2020-09-21T09:47:29+05:30 IST