రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి

ABN , First Publish Date - 2021-01-26T05:30:00+05:30 IST

ఢిల్లీలో రైతుల ట్రాక్టర్‌ ర్యాలీకి మద్దతుగా జిల్లా కేంద్రంలో మంగళవారం ప్రజా సంఘాలు, ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో భారీ బైక్‌ ర్యాలీని నిర్వహించారు.

రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి
రైతులకు మద్దతుగా మెదక్‌లో బైక్‌ ర్యాలీ నిర్వహిస్తున్న ప్రజా సంఘాల నాయకులు

మెదక్‌ పట్టణంలో పలు సంఘాల ఆధ్వర్యంలో భారీ బైక్‌ర్యాలీ

మెదక్‌ రూరల్‌/మెదక్‌ అర్బన్‌, జనవరి 26: ఢిల్లీలో రైతుల ట్రాక్టర్‌ ర్యాలీకి మద్దతుగా జిల్లా కేంద్రంలో మంగళవారం ప్రజా సంఘాలు, ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో భారీ బైక్‌ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మల్లేశం మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తెచ్చిన మూడు రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. రైతు వ్యతిరేక విధానాలను కేంద్ర ప్రభుత్వం వీడాలన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి నర్సమ్మ, ఉపాధ్యక్షురాలు బాలమణి, కోశాధికారి బస్వరాజ్‌, యూటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి  పద్మారావు, రవీందర్‌రెడ్డి, ఎస్‌ఎ్‌ఫఐ జిల్లా కార్యదర్శి సంతోష్‌, నాయకులు  పాల్గొన్నారు. కాగా టీపీటీఎఫ్‌ మెదక్‌ జిల్లాశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా బైక్‌ ర్యాలీ చేపట్టారు. జిల్లా కేంద్రంలోని గుల్షన్‌క్లబ్‌ నుంచి కలెక్టరేట్‌ కార్యాలయం వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా టీపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు కాముని రమేష్‌, రాష్ట్ర మాజీ అఽధ్యక్షుడు కొండల్‌ రెడ్డి మాట్లాడుతూ... రైతుల నడ్డివిరిచే వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.  కార్యక్రమంలో జిల్లా అసోసియేట్‌ అధ్యక్షుడు సత్యనారాయణ, జిల్లా, మండల నాయకులు నజీరొద్దిన్‌, పవన్‌, బాగయయ, రాజు, శ్రీనివాస్‌, సురేందర్‌, కిషన్‌, నాగరాజు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-26T05:30:00+05:30 IST