చెక్‌పవర్‌ కోసం నూతన సర్పంచుల ఎదురుచూపు

ABN , First Publish Date - 2021-05-17T05:25:17+05:30 IST

గ్రామపంచాయతీ సర్పంచులుగా ప్రమాణస్వీకా రం చేసి నెలన్నర కావస్తున్నా ప్రభుత్వం నేటికీ చెక్‌ పవర్‌ ఇవ్వలేదు. దీం తో గ్రామాలలో అభివృద్ధి కుంటుపడుతోంది.

చెక్‌పవర్‌ కోసం నూతన సర్పంచుల ఎదురుచూపు
నెరమెట్ల గ్రామ సచివాలయం

ఉరవకొండ, మే 16: గ్రామపంచాయతీ సర్పంచులుగా ప్రమాణస్వీకా రం చేసి నెలన్నర కావస్తున్నా ప్రభుత్వం నేటికీ చెక్‌ పవర్‌ ఇవ్వలేదు. దీం తో గ్రామాలలో అభివృద్ధి కుంటుపడుతోంది. మండలంలో 17 గ్రామ పం చాయతీలు ఉన్నాయి. ఎన్నికలు ముగిసి మూడు నెలలు అయినప్పటికి ప్ర భుత్వం చెక్‌పవర్‌ ఇవ్వలేదు. దీంతో పంచాయతీలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రజలకు పంచాయతీ కల్పించే సౌకర్యాల కోసం నిధులు వెచ్చించలేని పరిస్థితిని సర్పంచులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం వేసవి కావడంతో గ్రామాల్లో తాగునీటి మోటార్లు మరమ్మతులు, వీధిలైట్ల ఏర్పాటు, పారిశుధ్యం, నూతన పైప్‌లైన్ల నిర్మాణం తదితర అభివద్ధి పనులు చేపట్టేందుకు నిధుల కోసం సర్పంచులు ఎదురు చూడాల్సి వస్తోంది. ప్రస్తుతం కరోనా తీవ్ర రూపం దాల్చినందున గ్రామాలలో పారిశుధ్య పనులతో పాటు ఇతర అత్యవసర పనులు చేసేందుకు ని ధుల కొరత తీవ్రంగా ఉంది. నూతన సర్పంచుల నుంచి బ్యాంకు అకౌంట్‌ లు, ఐఎ్‌ఫసీ కోడ్‌, పాన కార్డు నెంబరు వివరాలు సేకరించారు. చెక్‌పవర్‌ ఇవ్వకపోవడంతో సర్పంచులు ఎదురుచూస్తున్నారు.


ఆర్థికంగా ఉన్న కొంద రు సర్పంచులు సొంత నిధులు ఖర్చుపెట్టి గ్రామాలలో పనులు చేస్తూ చె క్‌పవర్‌ రాగానే నిధులను తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఆర్థిక స్థోమత లేని సర్పంచులు పనులు చేసేందుకు ముందుకు రాలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి వెంటనే సర్పంచులకు చెక్‌పవర్‌ ఇ చ్చి గ్రామాల అభివద్ధికి సహకరించాలని కోరుతున్నారు. 


చిన్న పనులు కూడా చేయలేకపోతున్నాం

సీతారాములు, సర్పంచు, వ్యాసాపురం 

సర్పంచుగా ఎన్నికై మూడు నెలలు, ప్రమాణస్వీకారం చేసి నెలన్నర కావస్తున్నా ప్రభుత్వం చెక్‌పవర్‌ ఇవ్వలేదు. గ్రామాలలో చిన్న చిన్న పనులు చేయలేకపోతున్నాం. అభివృద్ధి కుంటుపడుతోంది. 


అభివృద్ధి పనులు కుంటుపడుతున్నాయి.. 

యోగేందర్‌రెడ్డి, సర్పంచు, నెరమెట్ల

చెక్‌పవర్‌ ఇవ్వకపోవడంతో అభివృద్ధి పనులు చేయలేకపోతున్నాం. వేసవి కావడంతో నీటి ఎద్దడి ఉంది. కరోనా నేపథ్యంలో పారిశుధ్య పనులు చేపట్టాల్సి ఉంది. బ్యాంకు ఖాతా నెంబర్లు, ఐఎ్‌ఫసీ కోడ్‌, ఇతర వివరాలు కూడా సేకరించారు. చెక్‌పవర్‌ను వెంటనే ఇవ్వాలి.

Updated Date - 2021-05-17T05:25:17+05:30 IST