చెన్నై: తమిళనాడు ఉన్నతవిద్యాశాఖ మాజీ మంత్రి, ఏఐఏడీఎంకే పార్టీ నాయకుడు కేపీ అన్బలగన్ ఇళ్లు, కార్యాలయాలపై గురువారం డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ అధికారులు దాడులు చేశారు. మాజీమంత్రి అన్బలగన్ 57 ఇళ్లు, కార్యాలయాలపై ఏకకాలంలో విజిలెన్స్, అవినీతి నిరో్ధక శాఖ అధికారులు దాడులు చేయడం సంచలనం రేపింది. గత ఏఐఏడీఎంకే నాయకుడైన అన్బలగన్ గత ప్రభుత్వ హయాంలో కీలకంగా వ్యవహరించారు. తమిళనాడు ఉన్నతవిద్యాశాఖ మంత్రిగా పనిచేసినపుడు వచ్చిన అవినీతి ఆరోపణలపై విజిలెన్స్, అవినీతి నిరోధకశాఖ అధికారులు ఆకస్మిక దాడులు చేసి దర్యాప్తు సాగిస్తున్నారు.
ఇవి కూడా చదవండి