Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Sun, 24 Jul 2022 21:47:44 IST

Black Alien: రోడ్డుపై రక్త పిశాచి బాబోయ్.. అంటూ అంతా పరుగులు.. చూస్తే మీరు కూడా వణికిపోతారు..

twitter-iconwatsapp-iconfb-icon
Black Alien: రోడ్డుపై రక్త పిశాచి బాబోయ్.. అంటూ అంతా పరుగులు.. చూస్తే మీరు కూడా వణికిపోతారు..

కొందరికి బతికుండగానే పిశాచం పడుతుంది. అది రక్త పిశాచి ఐతే ఆ రూపం ఇదిగో ఇంత భయానకంగా ఉంటుంది. ఫ్రాన్స్‌ (France) కు చెందిన ఆంథోనీ లోఫ్రెడో (Anthony Loffredo) అనే వ్యక్తికి వింత కోరిక ఉండేది. తనను తాను పిశాచిగా మారిపోవాలని కలలు కనేవాడు. చివరికి తన శరీరాన్ని పిశాచానికి విడిదిగా మార్చేసుకున్నాడు. రాత్రిళ్లు బయట తిరుగుతూ భయపెడతాడు. ఇప్పడు సెలబ్రెటీల దగ్గర నుంచి కాలేజ్ స్టూడెంట్స్‌ వరకూ అంతా.. టాటూ (tattoo) ట్రెండ్‌ ఫాలో అవుతున్నారు. ఇందులో బోలెడు రకాలు ఉన్నాయి. ఒకటి రెండూ వేయించుకోవడం అయితే కామనే అనుకోవచ్చు.. కానీ, బాడీ అంతా టాటూస్‌ ఉంటే.. దాన్ని ఏమనాలి. పిచ్చి పీక్స్‌కి చేరిందనే చెప్పాలి. ప్రస్తుతం ఆంథోనీ లోఫ్రెడో కూడా ఇలాగే బాడీ మొత్తం టాటూస్‌ వేసుకుని ‘బ్లాక్ ఏలియన్’గా మారిపోయాడు. దీంతో ప్రస్తుతం ఎక్కడా ఉద్యోగం దొరక్క పడరాని పాట్లు పడుతున్నాడు.

ఆంథోనీ లోఫ్రెడో ఒళ్లంతా టాటూలు వేసుకుని ‘బ్లాక్ ఏలియన్’గా మారిపోవాలనుకున్నాడు. కనుబొమ్మలతో పాటూ శరీరంలోని ప్రతి భాగాన్నీ టాటూస్‌తో నింపేశాడు. తల, చేతులు, చర్మం కింద ఇంప్లాంట్లు అమర్చుకున్నాడు. అంతేకాకుండా, అతని రెండు వేళ్లు, ముక్కు, చెవులు కూడా కట్ చేయించుకున్నాడు. ఫోర్క్‌డ్ ఎఫెక్ట్‌ క్రియేట్ చేసేందుకు నాలుకను మధ్యలోకి స్ల్పిట్ చేసుకున్నాడు. ప్రస్తుతం తన పరిస్థితితో లోఫ్రెడ్ తీవ్ర మనోవేదనకు గురవుతున్నాడు. ఈ రూపాన్ని చూసిన జనాలు జడుసుకుంటున్నారని చెప్పాడు. వీధుల్లో తనను చూసి అంతా భయంతో పరుగులు తీస్తున్నారట. కొందరు పిచ్చివాడని అంటుంటే.. మరికొందరు అతన్ని చూసి గట్టిగా అరుస్తూ భయపడిపోతున్నారని తెలిపాడు. అయితే జనాలు తనను చూసి భయపడడం.. తనకు ఆనందాన్ని కలిగిస్తోందని చెబుతున్నాడు.

woman bus driver: అంత అందగత్తె.. ఇంత గొప్ప బస్ డ్రైవర్.. మొత్తానికి రాష్ట్రంలోనే రికార్డు సృష్టించిందిగా..


ఇవి కూడా చదవండిLatest News in Telugu

Shocking decision: మీ కూతురు ఎక్కడ అని అడిగితే.. గండె పోటుతో చనిపోయిందని చెప్పండి.. అని లేఖ రాసి.. 15 ఏళ్ల బాలిక చేసిన పని..gun Firing: దీని ముందుకెళ్తే.. కాల్చిపారేస్తుంది.. ఆల్రెడీ మార్కెట్‌లోకి కూడా వచ్చేసింది..videoBank cash: యువతిని మాటల్లోకి దింపిన యువకుడు.. తిరిగి ఇంటికి వస్తుండగా పాస్‌బుక్ తెరచి చూసిన ఆమెకు.. పచ్చ చొక్కా అంకుల్ అంటూ.. ఏడుస్తూ టీచర్ దగ్గరకు వెళ్లి జరిగిన దారుణాన్ని చెప్పిన 8 ఏళ్ల బాలిక.. చివరకు..1433 Kilometers ప్రయాణించి భర్తను చేరుకున్న మహిళ.. ఇంటి ఎదుట ఏడు రోజులుగా కేవలం నీళ్లు తాగుతూ.. చివరకు రిక్షా డ్రైవర్ గమనించడంతో..Royal Enfield Bike కంటే ఈ మామిడి పండ్ల ధరే ఎక్కువ.. ఒక్క కిలో ఎన్ని లక్షల రూపాయలంటే..
Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.