అంతర్వేది, మార్చి 1: అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో కల్యాణోత్సవాలు జరిగిన 12 రోజుల ఆదాయాన్ని సోమవారం లెక్కించారు. ప్రధాన హుండీ ఆదాయం రూ.41,97,220, గుర్రాలక్కమ్మ హుండీ ఆదాయం రూ.99,407, అన్నదాన హుండీ ఆదాయం రూ.8388, మొత్తం హుండీల ఆదాయం రూ.43,05,015 వచ్చిందని ఆలయ సహాయ కమిషనర్ యర్రంశెట్టి భద్రాజీ తెలిపారు. ఈ కార్యక్రమంలో తనిఖీదారు జీఎస్వీ ప్రసాద్, సేవాదళ్ సభ్యులు, భక్తులు, ఆలయ సిబ్బంది, డిప్యుటేషన్ సిబ్బంది పాల్గొన్నారు.