ఉద్ధవ్‌కు మరో ఎదురుదెబ్బ
ABN , First Publish Date - 2022-07-30T08:46:08+05:30 IST
మహారాష్ట్ర సీఎం పదవి నుంచి వైదొలగిన తర్వాత శివసేన పార్టీపై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్న ఉద్ధవ్ ఠాక్రేకు మరో ఎదురుదెబ్బ తగిలింది.
సీఎం షిండేను కలిసిన ఠాక్రే అన్న కొడుకు నిహర్
ముంబై, జూలై 29: మహారాష్ట్ర సీఎం పదవి నుంచి వైదొలగిన తర్వాత శివసేన పార్టీపై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్న ఉద్ధవ్ ఠాక్రేకు మరో ఎదురుదెబ్బ తగిలింది. బాల్ ఠాక్రే స్థాపించిన శివసేనకు వారసుడిని తానేనని అంటున్న సీఎం ఏక్‌నాఽథ్ షిండేను.. ఉద్ధవ్ ఠాక్రే పెద్ద అన్న కొడుకు నిహర్ ఠాక్రే కలిసి మద్దతు ప్రకటించారు. ఇటీవలే ఠాక్రే చిన్న అన్న జైదేవ్ ఠాక్రే భార్య స్మిత ఠాక్రే కూడా ఆయనను కలిశారు. నిహర్కు రాజకీయాల్లో పెద్దగా అనుభవం లేదు. న్యాయవాది అయిన నిహర్ ఠాక్రే బీజేపీ నేత హర్షవర్ధన్ పాటిల్ కూతురు అంకిత పాటిల్‌ను వివాహం చేసుకున్నారు.