కరోనాతో పోరు మరో మహాభారత యుద్ధం!

ABN , First Publish Date - 2020-06-07T08:18:50+05:30 IST

కరోనాపై ప్రపంచం చేస్తున్న పోరాటాన్ని ఆక్స్‌ఫర్డ్‌ జర్నల్‌ మహాభారత యుద్ధంతో పోల్చింది. ఆరోగ్య కార్యకర్తలను

కరోనాతో పోరు మరో మహాభారత యుద్ధం!

లండన్‌, జూన్‌ 6: కరోనాపై ప్రపంచం చేస్తున్న పోరాటాన్ని ఆక్స్‌ఫర్డ్‌ జర్నల్‌ మహాభారత యుద్ధంతో పోల్చింది. ఆరోగ్య కార్యకర్తలను అర్జునుడిగా, ఆస్పత్రులను కురుక్షేత్రంగా పేర్కొంది. కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు చేసిన గీతోపదేశంలోని కొన్ని అంశాలను ప్రస్తుత స్థితికి అ న్వయించి చూపింది. అయినవాళ్లతో పోరుకు విముఖంగా ఉన్న అర్జునుడిలో ని వైరాగ్యాన్ని పోగొట్టేందుకు ‘నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు.. ఫలితాన్ని ఆ శించకు’ అంటూ శ్రీకృష్ణుడు చేసిన ధర్మబోధను ఉదహరిస్తూ.. ఆరోగ్య కార్యకర్తలకూ ఇలాంటి బోధ అవసరమని వ్యాఖ్యానించింది. వారు తమ ప్రాణాలకు తెగించి మన ప్రాణాలను కాపాడుతున్నారంటూ కొనియాడింది. 

Updated Date - 2020-06-07T08:18:50+05:30 IST