వైభవంగా అన్నమయ్య జయంతి ఉత్సవాలు

ABN , First Publish Date - 2022-05-17T05:32:44+05:30 IST

వైభవంగా అన్నమయ్య జయంతి ఉత్సవాలు

వైభవంగా అన్నమయ్య జయంతి ఉత్సవాలు
రంగరాజన్‌ అశీర్వాదం తీసుకుంటున్న ఎమ్మెల్యే యాదయ్య

మొయినాబాద్‌ రూరల్‌, మే 16: చిలుకూరు బాలాజీ ఆలయం అవరణలో సోమవారం జ్ఞనపద ఆదిగురువు శ్రీ అన్నమచార్యులు జయంతి ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. తిరుమలకు చెందిన అన్నమయ్య కళాక్షేత్రం, సనాతన ధర్మ ప్రచార పరిషత్‌ వ్యవస్థాపకులు శ్రీశ్రీశ్రీ విజయ శంకర్‌ స్వామిజీ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నమయ్య కీర్తనలు ప్రత్యేకంగా ఆలపించారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకుడు  సీఎ్‌స.రంగరాజన్‌ మాట్లాడుతూ ఏపీలోని వైసీపీ ప్రభుత్వం కొండపై టీటీడీ అవలంభిస్తున్న విధానం సరికాదన్నారు. తిరుమలలో అన్నమయ్య కీర్తనలు కొనసాగించాల్సిందేనని స్పష్టం చేశారు. అన్నమయ్య పురాతన నివాసస్థలాన్ని పునరుద్ధరించాలని, చిరకాలంగా నిలిచిపోయిన హరినామ సంకీర్తనలను పునరుద్ధరించాలని కోరారు. అదేవిధంగా అన్నమయ్య జయంతి, వర్ధంతిలను ప్రతీ సంవత్సరం నిర్వహించాలని సూచించారు. 

చిలుకూరులో ఎమ్మెల్యే యాదయ్య ప్రత్యేక పూజలు

మొయినాబాద్‌ రూరల్‌/కేశంపేట మే 16: చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య తన జన్మదినాన్ని పురస్కరించుకుని సోమవారం చిలుకూరు బాలాజీ శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేకపూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు ఎమ్మెల్యేకు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు. కార్యక్రమంలో గోపాల కృష్ణపంతులు, ఎంపీపీ నక్షత్రం జయవంత్‌, సర్పంచ్‌ స్వరూప ఆండ్ర్యూ, టీఆర్‌ఎస్‌ నాయకులు మహేందర్‌రెడ్డి, సురేందర్‌గౌడ్‌, రాంచందర్‌, నర్సింహాగౌడ్‌, భిక్షపతిగౌడ్‌, దర్గా రాజు, చెన్నయ్య తదితరులు ఉన్నారు. అదేవిధంగా కేశంపేట మండలంలోని ఎక్లా్‌సఖాన్‌పేట గ్రామంలో వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభంమయ్యాయి. ఈ సందర్భంగా షాద్‌నగర్‌ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌ లక్ష్మమ్మ దంపతులు ఆదివారం రాత్రి వేదపండితులు మంత్రోచ్చరణల మధ్య ధ్వజారోహణం చేసి దేవతలను ఆహ్వానించి స్వామివారి ఉత్సవాలను ప్రారంభించారు. సోమవారం కేశంపేట ఎంపీపీ రవీందర్‌ యాదవ్‌-కవిత దంపతులు గణపతిపూజ, రుద్రహోమము నిర్వహించారు. అదేవిధంగా మంగళవారం శ్రీదేవి, భూదేవి సహిత శ్రీవేంకటేశ్వర స్వామి కల్యాణాన్ని నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. 

ఘనంగా బీరప్ప బోనాలు

మొయినాబాద్‌ మండలంలోని రెడ్డిపల్లి గ్రామంతో పాటు కేతిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ అనుబంద గ్రామం చాకలిగూడ గ్రామాల్లో సోమవారం బీరప్ప బోనాలు, కల్యాణ మహోత్సవాలను వైభవంగా నిర్వహించారు. మహిళలు  బోనాలతో ఆలయానికి చేరుకొని స్వామివార్లకు నైవేద్యాన్ని సమర్పించారు. పోతరాజుల విన్యాసాలు, డిల్లెంపల్లెం చప్పుళ్లతో ఆధ్యాత్మికత సంతరించుకుంది. అదేవిధంగా ఒగ్గు కథలను ఆలపించారు. చాకలిగూడలో నిర్వహించిన బోనాల ఊరేగింపులో ఎంపీటీసీ అర్చన యాదయ్య పాల్గొన్నారు. సర్పంచులు శోభ, వినిత, ఎంపీటీసీలు అర్చన యాదయ్య, పాల్గొన్నారు.

Updated Date - 2022-05-17T05:32:44+05:30 IST