అంకాళమ్మ ఆలయంలో బొల్లినేని పూజలు

ABN , First Publish Date - 2022-06-24T04:07:02+05:30 IST

మండలంలోని పెద్దిరెడ్డిపల్లి అంకాళమ్మ ఉత్సవాల్లో గురువారం మాజీ శాసనసభ్యులు బొల్లినేని వెంకటరామారావు పాల్గొన్నా

అంకాళమ్మ ఆలయంలో బొల్లినేని పూజలు
పూజలు నిర్వహిస్తున్న బొల్లినేని

వరికుంటపాడు, జూన్‌ 23: మండలంలోని పెద్దిరెడ్డిపల్లి అంకాళమ్మ ఉత్సవాల్లో గురువారం మాజీ శాసనసభ్యులు బొల్లినేని వెంకటరామారావు  పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బండ్ల మహోత్సవంలో పాల్గొని కొంతసేపు ట్రాక్టర్‌ నడిపారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ప్రమాదవశాత్తు గాయాల పాలైన అడుసుమల్లి వెంకటేశ్వర్లు అలియాస్‌ బయ్యన్న నివాసానికి వెళ్లి పరామర్శించారు.  ఆయన వెంట టీడీపీ మండల కన్వీనర్‌ చండ్ర. మధుసూదనరావు, చండ్ర. వెంకయ్య, అడుసుమల్లి. రవిచంద్ర, నాదిండ్ల. రాజేంద్ర తదితరులు ఉన్నారు. 


ముగిసిన ఉత్సవాలు


ఐదు రోజులుగా నిర్వహిస్తున్న అంకాళమ్మ ఉత్సవాలు గురువారం ముగిశాయి.  చివరిరోజు అభిషేకాలు, ఆకుపూజ, పాలపొంగళ్లు, బండ్లు మహోత్సవాలు  నిర్వహించారు.వలస వాసులు అధిక సంఖ్యలో గ్రామానికి చేరుకోవడంతో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు, అన్నదానం ఏర్పాటు చేశారు. 


Updated Date - 2022-06-24T04:07:02+05:30 IST