కోవిడ్-19 జంతువుల నుంచి మానవునికి సంక్రమించలేదు : ఎయిమ్స్ డాక్టర్ చంద్రకాంత్

ABN , First Publish Date - 2020-04-10T21:32:37+05:30 IST

జంతువులు కోవిడ్-19ను వ్యాపింపజేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఢిల్లీలోని

కోవిడ్-19 జంతువుల నుంచి మానవునికి సంక్రమించలేదు : ఎయిమ్స్ డాక్టర్ చంద్రకాంత్

న్యూఢిల్లీ : జంతువులు కోవిడ్-19ను వ్యాపింపజేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఢిల్లీలోని ఎయిమ్స్‌ డాక్టర్ చంద్రకాంత్ పాండవ్ కొట్టిపారేశారు. తప్పుడు సమాచారం, వక్రీకరించిన సమాచారం వంటివాటికి ఈ ప్రచారం, వదంతులు గొప్ప ఉదాహరణ అని తెలిపారు. 


ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)కు చెందిన సెంటర్ ఫర్ కమ్యూనిటీ మెడిసిన్ అధిపతి డాక్టర్ చంద్రకాంత్ మాట్లాడుతూ తప్పుడు, వక్రీకరణలతో కూడిన సమాచారాన్ని ప్రచారం చేయడం నేరమని తెలిపారు. జంతువుల నుంచి మానవులకు కోవిడ్-19 వ్యాపించినట్లు వదంతులు సృష్టించి, ప్రచారం చేయడం తప్పుడు, వక్రీకరణలతో కూడిన సమాచారానికి గొప్ప ఉదాహరణ అని తెలిపారు. దీనిని తాను నేరంగా పరిగణిస్తున్నానన్నారు.


కుక్కలు, పిల్లులు కోవిడ్-19ను వ్యాపింపజేస్తున్నట్లు కానీ, అవి ఈ వ్యాధికి గురైనట్లు కానీ ఎటువంటి సాక్ష్యాధారాలు లేవని ప్రపంచంలోని అన్ని మెడికల్ ఇన్‌స్టిట్యూట్స్ చెప్తున్నాయని తెలిపారు. 


పెంపుడు కుక్కలు, పెంపుడు పిల్లులు కోవిడ్-19ను వ్యాపింపజేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారం గురించి ప్రస్తావించినపుడు డాక్టర్ చంద్రకాంత్ మాట్లాడుతూ ఇదంతా పూర్తిగా తప్పు అని తెలిపారు. తప్పుడు, వక్రీకరణలతో కూడిన సమాచారానికి ఇది గొప్ప ఉదాహరణ అని తెలిపారు. ఇది ఓ నేరమని తాను భావిస్తున్నానన్నారు. ఇటువంటి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడం నేరమని తాను భావిస్తున్నట్లు తెలిపారు. 


సామాజిక మాధ్యమాలు రెండువైపులా పదునుగల కత్తి వంటివని, దీనిని మంచి కోసం, అదేవిధంగా చెడు కోసం ఉపయోగించుకోవచ్చునని పేర్కొన్నారు. ప్రజలకు సమాచారాన్ని ఏ విధంగా అందజేస్తున్నామో తెలుసుకుంటూ, ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలన్నారు. ఇటువంటి వార్తలను ప్రచారం చేయడం క్రిమినల్ నేరంగా పరిగణించాలన్నారు.


Updated Date - 2020-04-10T21:32:37+05:30 IST