Abn logo
Jun 20 2021 @ 00:51AM

మూగజీవాలు చచ్చిపోతున్నాయ్‌..!

 సకాలంలో వైద్యం అందక మరణిస్తున్న జీవాలు

తొలకరిలో కొత్తవ్యాధులు వచ్చే ప్రమాదం

 గతమూడు నెలల్లో 750కి పైగా గేదెలు, ఆవులు మృతి

200 దాకా ఇతర జీవాలు..

గ్రామాల్లో వేధిస్తున్న వైద్య సిబ్బంది కొరత 

అందుబాటులో లేని మందులు 


ఒంగోలు(జడ్పీ), జూన్‌ 19: జిల్లాలో మూగజీవాలు గత మూడు నెలలుగా   గణనీయ సంఖ్యలో చనిపోతు న్నాయి. ఇలా మరణించిన వాటిలో సకాలంలో వైద్యం అ ందక మృతువాతపడినవే ఎక్కువశాతం ఉన్నాయి. తొలక రి నేపథ్యంలో సాధారణంగా సంక్రమించే వ్యాధులతో పా టు అంతుచిక్కని రోగాలు సైతం పశువులకు సోకే అవకా శాలు మెండుగా ఉన్నాయి. పశువులకు వైద్యం అందించ డంతో పాటు ఆయా మందులు  గ్రామాలలో అందుబా టులో ఉండేటట్లు చూడడం వల్ల తొలకరి వ్యాధుల నుం చి మూగజీవాలను రక్షించుకోవచ్చు. కొన్ని జీవాలకు అం దించే వ్యాక్సినేషన్‌ను కూడా సమర్థంగా నిర్వహించడం వల్ల కూడా మరణాలను నివారించే వీలుంది. క్షేత్రస్థాయి లో సేవలందించే వెటర్నరీ అసిస్టెంట్ల పోస్టులు ఏళ్లతరబ డి భర్తీకి నోచుకోకపోవడం వల్ల కూడా సేవలు సకాలం లో అందడం లేదు. చాలా గ్రామాల్లో  పశువైద్యశాలలు శిథిలావస్థకు చేరుకున్నాయి. అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి పశువులకు సోకే వ్యాధులు, వాటి నివారణ కు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పశుపోషకులను చైతన్యప రచాల్సి ఉంది. కానీ అలాంటివి జరుగుతున్న దాఖలాలు మచ్చుకైనా కన్పించడం లేదు. ఆయా విభాగాల్లో ఉన్న ఖాళీలను సత్వరం భర్తీ చేయడంతో పాటు మందులను అందుబాటులో ఉంచడం, క్షేత్రస్థాయిలో అవగాహన ఇవ న్నీ చేయగలిగితే మూగజీవాల మరణాలకు అడ్డుకట్టపడే వీలుంది


పశుసంవర్థకశాఖ నిర్లక్ష్యం


గత మూడునెలల వ్యవధిలో అధికారిక లెక్కల ప్రకారమే 750 దాకా గేదెలు, ఆవులు వివిధ కారణాలతో మృతి చెందాయి. వీటికి గొర్రెలు, మేకల సంఖ్య అదనం. ఇవి దాదాపుగా 200దాకా ఉండోచ్చని అంచనా. అధికారిక గణాంకాలే ఇన్ని మరణాలను ధ్రువీకరిస్తున్నాయంటే అన ధికారికంగా మరో 500 వరకు చనిపోయి ఉండవచ్చని భావిస్తున్నారు. సహజసిద్ధమైన వ్యాధులతోనో, రోడ్డు, రైలు ప్రమాదాల వల్ల విద్యుదాఘాతాలవల్లో చనిపోయినవి స్వ ల్పమే. చాలా వరకు సకాలంలో వ్యాధిని గుర్తించగలిగి మెరుగైన చికిత్స అందించగల్గితే జీవాలు బతికేవి. పశుపో షకుల అవగాహన లేమికి తోడు పశుసంవర్థకశాఖ నిర్ల క్ష్యం కూడా వాటి ఉసురు తీసింది.


పొంచివున్న తొలకరి ముప్పు..


ప్రతి ఏటా తొలకరి ప్రారంభంలో అంతుచిక్కని వ్యా ధులు చుట్టిముట్టి జీవాల మరణాలు పెరుగుతుంటాయి. వీటిని నివారించాలంటే క్షేత్రస్థాయిలో సిబ్బంది పర్యవేక్షణ కు తోడు కొత్త వ్యాధి లక్షణాలు ఏవైనా కనిపిస్తే వాటి న మూనాలను ప్రయోగశాలలకు పంపించి నిర్ధారణతో పా టు చికిత్సను కూడా సత్వరమే కనిపెట్టి అందించాలి. బొ బ్బరోగం, జబ్బవాపు, డయేరియా తదితర వ్యాధులు ఈ సీజన్‌లో పశువులకు అధికంగా సోకే ప్రమాదముంది. సీజన్‌లో సంప్రదాయంగా వచ్చే వ్యాధులకు మందులను ముందస్తుగానే గ్రామాల్లో ఇంటింటికీ పంపిణీ చేసి సంబ ంధిత లక్షణాలు కనబడితే మందులు వేసేలా యంత్రాం గం చర్యలు తీసుకోవాల్సి ఉంది.


పశుగణనపై దృష్టి పెట్టని యంత్రాంగం


పశుగణనపై ప్రభుత్వం దృష్టి సారించకపోవడంతో గ తంలో ఉన్న లెక్కలనే ప్రస్తుతం కూడా ప్రామాణికంగా తీసుకుంటున్నారు. పశువుల సంఖ్యపై కచ్చితమైన లెక్క ఉంటే దానికి అనుగుణంగా యంత్రాంగం ఏర్పాట్లు చేసు కునే వీలుంటుంది. కానీ ఇప్పటికి కూడా పాత లెక్కలనే పరిగణలోకి తీసుకుంటున్నారు. గతంలో ఉన్న లెక్కల ప్రకారం గేదెల సంఖ్య 9.10 లక్షలుకాగా, ఆవులు 1.25లక్ష లుగా ఉన్నాయి. ఇక గొర్రెలు, మేకల విషయానికొస్తే 26 లక్షలు ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి


క్షేత్రస్థాయిలో వైద్యుల కొరత..


గ్రామ సచివాలయాల్లోని పశుసంవర్థక సహాయకుల విభాగంలో జిల్లావ్యాప్తంగా 367 ఖాళీలు ఉండడం సిబ్బం దిని తక్షణం నియమించుకోవాల్సిన అవసరాన్ని ఎత్తి చూ పుతోంది. కాంపౌండర్‌ విభాగంలో జిల్లావ్యాప్తంగా 40 ఖా ళీలు ఉన్నాయి. ఇవేగాక ఇతర విభాగాల్లో ఉన్న అన్ని ఖా ళీలను కలిపితే ఈ సంఖ్య మొత్తం 600పైనే ఉండొచ్చని సమాచారం. ప్రభుత్వం ఇప్పటికైనా ఖాళీల భర్తీకి కార్యా చరణ ప్రకటించడంతో పాటు క్షేత్రస్థాయి సిబ్బందిని గ్రా మాలలో పర్యటించేవిధంగా ఆదేశాలివ్వడం వల్ల మూగజీ వాల మరణాలను పరిమితం చేసే వీలుంది.