డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పై ఆగ్రహం

ABN , First Publish Date - 2021-04-11T06:11:10+05:30 IST

డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల లబ్ధిదారుల ఎంపికపై గ్రామసభల్లో ప్రజలు ఆగ్ర హం వ్యక్తం చేశారు. శనివారం తంగళ్లపల్లి మండ లం జిల్లెల్ల, తాడురు, గోపాల్‌రావుపల్లె, కస్భెకట్కూ ర్‌, గండిలచ్చపేట, లక్ష్మిపూర్‌, అంకుసాపూర్‌, ఇంది రనగర్‌లో డబుల్‌ బెడ్‌రూం లబ్ధిదారుల ఎంపిక కో సం గ్రామసభలు నిర్వహించారు.

డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పై ఆగ్రహం
మానేరు వంతెనపై రాస్తారోకో చేస్తున్న మహిళలు

తంగళ్లపల్లి, ఏప్రిల్‌ 10: డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల లబ్ధిదారుల ఎంపికపై  గ్రామసభల్లో ప్రజలు ఆగ్ర హం వ్యక్తం చేశారు. శనివారం తంగళ్లపల్లి మండ లం జిల్లెల్ల, తాడురు, గోపాల్‌రావుపల్లె, కస్భెకట్కూ ర్‌, గండిలచ్చపేట, లక్ష్మిపూర్‌, అంకుసాపూర్‌, ఇంది రనగర్‌లో డబుల్‌ బెడ్‌రూం లబ్ధిదారుల ఎంపిక కో సం గ్రామసభలు నిర్వహించారు. ఆయా గ్రామాల సర్పంచ్‌ల అధ్యక్షతన  ప్రత్యేకాధికారులు డిప్యూటీ తహసీల్దార్‌ రజిత, సీనియర్‌ అసిస్టెంట్‌ శ్రీధర్‌, ఆర్‌ఐ సంతోష్‌కుమార్‌ హాజరయ్యారు. జిల్లెల్ల, గో పాల్‌రావుపల్లె గ్రామాల్లో  అర్హుల జాబితా ప్రకటిం చగానే ప్రజలు  వ్యతిరేకించారు. అనర్హులకు కేటా యిస్తున్నారని అధికారులను, ప్రజాప్రతినిధులను నిలదీశారు.  అనర్హులను తొలగించి అర్హులకు కేటా యించాలని డిమాండ్‌ చేశారు. సర్పంచులు, ఎంపీ టీసీలు సురభి స్రవంతి నవీన్‌రావు, పద్మవెంకటరె డ్డి, ములిగె దుర్గాప్రసాద్‌, మిట్టపెల్లి పద్మ జవహ ర్‌రెడ్డి, కొయ్యడ ఎల్లవ్వ, కుంటయ్య, మాట్ల మధు, పిట్టల నాగరాజ్‌, వేణుగోపాల్‌రావు, జంగిటి అంజయ్య, నీరటి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 


డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల కోసం రాస్తారోకో  

తంగళ్లపల్లి :  అనర్హులను డబుల్‌ బెడ్‌రూం ఇళ్లకు ఎంపిక చేశారని, అర్హులకు కేటా యించాలని  తంగళ్లపల్లి మండలం సారంపల్లి గ్రామ మహిళలు డిమాండ్‌ చేశారు. శనివారం   మండల కేంద్రంలో మానేరు వంతెనపై  రాస్తా రోకో చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లడుతూ శుక్రవారం గ్రామ సభ నిర్వహించి డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లకు  అనర్హులను ఎంపిక చేశారని మండి పడ్డారు.  డబుల్‌ బెడ్‌రూం లబ్ధిదారుల ఎంపిక సక్రమంగా లేదని, గ్రామ సభలో నిలదీసినా పట్టిం చుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.   తిరిగి సర్వే చేసి అసలైన అర్హులను ఎంపిక చేయాలని డిమాండ్‌ చేశారు. మహిళలకు మద్దతుగా కాం గ్రెస్‌ యూత్‌ నాయకుడు మునిగెల రాజు మద్దతు తెలిపారు. రాస్తారోకో విషయం తెలుసుకున్న రూరల్‌ సీఐ ఉపేందర్‌, ఎస్సై లక్ష్మారెడ్డి ఆందోళన విరమింప జేశారు. అనంతరం మహిళలు తహసీ ల్దార్‌ కార్యాలయానికి చేరుకొని తహసీల్దార్‌ సదా నందంకు వినతి పత్రం అందజేశారు. 


కంచర్లలో..

వీర్నపల్లి : వీర్నపల్లి మండలం కంచ ర్లలో శనివారం గ్రామసభలో ప్రవేశపెట్టిన డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల అర్హుల జాబితా గందరగోళంగా ఉండడంతో స్థానికులు అధికారులపై ఆగ్రహం వ్య క్తం చేశారు. అర్హులకు ఇళ్లు కేటాయించారని మం డిపడ్డారు.  మొదట ప్రకటించిన జాబితాలో తమ పేర్లను అర్హులుగా చూపించారని, రెండో జాబితా లో అనర్హులు అనడంలో ఆంతర్యం ఏమిటని ప్ర శ్నించారు. సర్పంచ్‌ భర్త తనకు అనువైన వారికి డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కేటాయించారని ఆరోపించా రు.  సభ్యులు అడిగిన ప్రశ్నలకు సర్పంచ్‌ భర్త ఆ గ్రహం వ్యక్తం చేస్తూ వెళ్లిపోయారు. మహిళా సర్పంచ్‌ ఉండగా ఆమె భర్తే పెత్తనం చెలాయిస్తున్నారని పలువురు గ్రామస్థులు ఆరోపించారు. త క్షణమే జాబితాను రద్దుచేసి అర్హులతో కూడిన జా బితాను ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. సర్పం చ్‌ రజిత, ఆర్‌ఐ శ్రీనివాస్‌, ఎంపీటీసీ మల్లారపు ఆరుణ్‌, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-11T06:11:10+05:30 IST