Advertisement
Advertisement
Abn logo
Advertisement

విజయవాడ: అంగన్‌వాడి వర్కర్ల ధర్నా

విజయవాడ: అంగన్‌వాడి వర్కర్లు తమ సమస్యల పరిష్కారం కోసం ధర్నా చౌక్‌లో ధర్నాకు దిగారు. సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్‌వాడి వర్కర్లు రాష్ట్ర స్థాయి ధర్నా చేపట్టారు.


ప్రధాన డిమాండ్స్...

అంగన్‌వాడీలకు కనీస వేతనం రూ. 21000/- ఇవ్వాలి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ. 5 లక్షలు, వేతనంలో సగం పెన్షన్.., గ్రేడ్ 2 సూపర్‌వైజర్ పోస్టులకు వయోపరిమితి 50 ఏళ్లు పెంచాలి, అంగన్‌వాడీలకు సంక్షేమ పధకాలు అమలుచేయాలి, రేషన్ కార్డులు తొలగించకూడదు, అంగన్‌వాడి సెంటర్ల నిర్వహణకు ట్యాబ్లు ఇవ్వాలి, హెల్పర్ల ప్రమోషన్స్ విషయంలో రాజకీయ జోక్యాన్ని అరికట్టాలి, కరోనాతో చనిపోయిన అంగన్‌వాడీలకు రూ. 50 లక్షలు భీమా వర్తింపజేయాలి, వేతనంతో కూడిన మెడికల్ లీవ్ సౌకర్యం కల్పించాలి, ఉద్యోగం చేస్తూ ఎవరైనా చనిపోతే ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి, మినీవర్కర్లకు మెయిన్ వర్కర్స్‌తో సమానంగా వేతనం ఇవ్వాలి, 400 జనాభా దాటిన మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలి, వైఎస్పార్ సంపూర్ణ పోషణ మెను చార్జీలు పెంచాలి, టిఏ బిల్లులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

Advertisement
Advertisement