అంగన్‌వాడీ కేంద్రాలను ఆధునిక వసతులతో తీర్చిదిద్దాలి

ABN , First Publish Date - 2021-04-16T05:31:38+05:30 IST

మండలంలో ఎంపికైన అంగన్‌వాడీ కేంద్రాలను అత్యాధునిక వసతులతో అద్భుతంగా తీర్చిదిద్దాలని ఎంపీడీవో రమేశ్‌నాయుడు సూచించారు. స్థానిక ఐసీడీఎస్‌ కార్యాలయంలో సీడీపీవో కేఎల్‌ఆర్‌కే కుమారి అధ్యక్షతన మన అంగన్‌వాడీ, నాడు-నేడు అంగన్‌వాడీ అభివృద్ధి కమిటీలకు గురువారం శిక్షణ కార్యక్రమం నిర్వహిం చారు.

అంగన్‌వాడీ కేంద్రాలను ఆధునిక వసతులతో తీర్చిదిద్దాలి
మాట్లాడుతున్న ఎంపీడీవో రమేశ్‌నాయుడు

ఎంపీడీవో రమేశ్‌నాయుడు

సబ్బవరం, ఏప్రిల్‌ 15 : మండలంలో ఎంపికైన అంగన్‌వాడీ కేంద్రాలను అత్యాధునిక వసతులతో అద్భుతంగా తీర్చిదిద్దాలని ఎంపీడీవో రమేశ్‌నాయుడు సూచించారు. స్థానిక ఐసీడీఎస్‌ కార్యాలయంలో సీడీపీవో కేఎల్‌ఆర్‌కే కుమారి అధ్యక్షతన మన అంగన్‌వాడీ, నాడు-నేడు అంగన్‌వాడీ అభివృద్ధి కమిటీలకు గురువారం శిక్షణ కార్యక్రమం నిర్వహిం చారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అంగన్‌ వాడీ కేంద్రాలను ప్రీ ప్రైమరీ స్కూల్స్‌గా మార్చడం శుభ పరిణామమన్నారు. కొత్త కేంద్రాల నిర్మాణం, అప్‌గ్రేడ్‌ చేసిన అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణంలో అన్ని ప్రమాణాలను పాటించాలన్నారు.  మండలంలో నాడు- నేడు స్కూల్స్‌ను అద్భుతంగా తీర్చిదిద్దారని, ఆ స్థాయిలో అంగన్‌వాడీ కేంద్రాలను తీర్చిదిద్దాలన్నారు. కార్యక్రమంలో హౌసింగ్‌ ఏఈ శేఖరనాయుడు, ఆర్‌డ బ్ల్యూఎస్‌ ఏఈ హిమబిందు, అంగన్‌వాడీ కేంద్రాల సిబ్బంది, గ్రామ మహిళా పోలీసులు, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. 


పౌష్టికాహారం అందించాలి 

గాజవాక: గర్భిణులు, పిల్లలకు పౌష్టికాహారం అందించేందుకు చర్యలు తీసుకోవాలని 65వ వార్డు కార్పొరేటర్‌ బొడ్డు నరసింహపాత్రుడు అంగన్‌వాడీ నిర్వాహకులకు సూచించారు. ప్రియదర్శిని కాలనీ కేంద్రాన్ని గురువార ఆయన తనిఖీ చేశారు. పిల్లల హాజరు పట్టీ, గర్భిణుల జాబితా పరిశీలించారు. మద్దాల అప్పారావు, పిట్టా సూర్యప్రకాశ్‌రెడ్డి, అడిగర్ల రమణ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-16T05:31:38+05:30 IST