జగన్ సర్కార్ మోసాలకు అంతు లేదా?

ABN , First Publish Date - 2022-06-24T02:07:19+05:30 IST

ఆంధ్రప్రదేశ్‎లో(Andhdrapradesh)లో ముస్లిం మైనార్టీల విద్యార్థుల పొట్ట పరిస్థితి నెలకొంది. విదేశీ విద్య పథకం ముస్లిం మైనార్టీ(muslim minority)లకు..

జగన్ సర్కార్ మోసాలకు అంతు లేదా?

అమరావతి/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‎లో(Andhdrapradesh)లో ముస్లిం మైనార్టీల విద్యార్థుల పొట్ట పరిస్థితి నెలకొంది. విదేశీ విద్య పథకం ముస్లిం మైనార్టీ(muslim minority)లకు కూడా వర్తిస్తుంది. ఈ పథకంలో భాగంగా విదేశాలకు వెళ్లే విద్యార్థులకు గత ప్రభుత్వం కొంత ఆర్థిక సాయం చేసింది. ముస్లిం ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే దుల్హన్ పథకం ద్వారా రూ. 50 వేలు అందజేసింది. అయితే జగన్ అధికారంలోకి వచ్చే ముందు దుల్హన్ పథకం ద్వారా రూ. లక్ష కానుకగా ఇస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతున్నా ఆ డబ్బులు ఇవ్వడంలేదు. దాంతో ఓ మైనార్టీ హక్కుల నేత.. హైకోర్టు (HighCourt)లో పిటిషన్ దాఖలు చేశారు. ఇందుకు ఏపీ ప్రభుత్వం (Ap Government)  ‘‘దుల్హన్ పథకానికి డబ్బులు లేవు.. అందుచేత పథకాన్ని ఆపివేస్తున్నాం’’ అని సమాధానం ఇచ్చింది. హామీ ఇచ్చి ఇంత దారుణంగా సమాధానం ఇవ్వడంపై ముస్లిం మైనార్టీల నుంచి ప్రభుత్వంపై విమర్శలు వినిపిస్తున్నాయి. సంక్షేమం పేరు చెప్పుకునే ప్రభుత్వం ‘దుల్హన్’ పథకాన్ని ఆపివేస్తున్నామని చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


ఈ నేపథ్యంలో ‘‘జగన్ (Jagan) సర్కార్ మోసాలకు అంతు లేదా?. ముస్లిం మైనార్టీలను పచ్చిగా దగా చేస్తారా?. పథకాలనే ఆపేస్తున్నామని చెప్పడం సిగ్గు చేటు కాదా?. జనం ముక్కుపిండి వసూలు చేస్తున్న సొమ్ములెక్కడ?. కేంద్రం నుంచి హైజాక్ చేస్తున్న నిధులెక్కడ?. ఇబ్బడిముబ్బడిగా తెస్తున్న అప్పులేం చేస్తున్నాం?.’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు..



Updated Date - 2022-06-24T02:07:19+05:30 IST