అనంతపురం: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. థర్డ్ వేవ్‌లో రికార్డుస్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. రోజువారి కేసులు భారీగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డికి కరోనా పాజిటీవ్ వచ్చింది. వైద్యుల సూచన మేరకు ఆయన హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ఇటీవల తనను కలిసినవారు పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.