Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్.. గుత్తి సీఐను జిల్లా పోలీస్ ఆఫీసుకు అటాచ్ చేస్తూ అదేశాలు

అనంతపురం: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్... గుత్తి సీఐ రామును అనంతపురం జిల్లా పోలీస్ కార్యాలయంకు అటాచ్ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. గుంతకల్లు ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి  సింహం లాంటోడు అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. సిఐ వైసీపీ కార్యకర్తలా మాట్లాడిన తీరుపై సామాజిక మధ్యమాల్లో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై స్పందించిన అధికారులు ఈ మేరకు ఆదేశాలిచ్చారు.


మంగళవారం గుత్తిలో జరిగిన ఓ కార్యక్రమానికి ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి హాజర్యారు. ఈ సందర్భంగా సీఐ రాము మాట్లాడుతూ ఎమ్మెల్యే సింహం లాంటి వారని, ఆయనలో నాయకత్వ లక్షణాలు మెండుగా ఉన్నాయంటూ  పొగడ్తలతో ముంచెత్తారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అయింది. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement