అనంతపురం జిల్లా: భార్య మరణాన్ని జీర్ణించుకోలేని భర్త తన నలుగురు పిల్లలతో కలిసి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని కణేకల్లు హెచ్ఎల్సీ కాలువలోకి నలుగురు పిల్లలతో కలిసి దూకిన తండ్రిని స్థానికులు సకాలంలో చూసి కాపాడారు. తండ్రితోపాటు నలుగురు పిల్లలకు ప్రాణాపాయం తప్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
ధర్మవరానికి చెందిన మాధవయ్య చేనేత కార్మికుడు. భార్య బాలమ్మ ఇటీవల కిడ్నీ వ్యాధితో బాధపడుతూ మృతి చెందింది. మాధవయ్య దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు, ఒక మగ పిల్లాడు ఉన్నారు. భార్య అకాలమరణాన్ని జీర్ణించుకోలేక ఆయన మానసిక వేధనకు గురయి ఈ ఘటనకు పాల్పడ్డాడు.