అనంతపురం: నగరంలో పెను ప్రమాదం తప్పింది. అరవింద్ నగర్ దగ్గర ఓ ప్రైవేటు ఆస్పత్రి ఎదుట నిలిపిన అంబులెన్స్ మంటల్లో తగలబడింది. ఆక్సిజన్ సిలెండర్లలో గ్యాస్ లీకై మంటలు వ్యాపించాయి. అంబులెన్స్ క్షణాల్లోనే తగలబడింది. అందులో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. అయితే మంటల వేడికి పక్కనే పార్క్ చేసి ఉన్న కొన్ని ద్విచక్రవాహనాలు దెబ్బతిన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన ప్రదేశానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.