అనంతపురం: జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా యల్లనూరు మండలం గోడ్డుమర్రి రిజర్వాయర్‌కు గండి పడింది. ఆనకట్ట తెగిపోవడంతో చిలమకూరు గ్రామంలోకి వర్షపు నీరు వచ్చి చేరింది. దీంతో ప్రజలు చిలమకూరు గ్రామాన్ని ఖాళీ చేసి మోడల్ స్కూల్‌కి వెళ్తున్నారు. చిత్రావతినది కి వరద రావడంతో పరివాహక ప్రాంతంలోని గ్రామాలను అధికారులు అప్రమత్తం చేశారు.