అనంతపురం: జిల్లాలోని కదిరిలో రెండంతస్తుల భవనం కూలిన ఘటనలో శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు శిథిలాల కింద నుంచి 12 మందిని వెలికితీశారు. వారిలో వారిలో 5 మంది అక్కడిక్కడే మృతి చెందారు. ప్రాణాలతో బయటపడిన నలుగురు బ్యాచిలర్స్, మరో ఇద్దరు దంపతులని చికిత్స నిమిత్తం కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. శిథిలాల కింద మరో చిన్నారి, వృద్ధురాలు ఉన్నట్లుగా బంధువులు చెబుతున్నారు.