Narsipatnam: గ్రామంలో బడిలేదు.. గుడి లేదు.. రోడ్లు లేవంటూ స్థానికులు వైసీపీ ఎమ్మెల్యే ఉమాశంకర్ (Umasankar)ను ప్రశ్నించారు. రకరకాల కారణాలు చూపుతూ ప్రభుత్వ పథకాలు నిలిపివేస్తున్నారని మహిళలు ధ్వజమెత్తారు. మహిళలు ఎదురుతిరగడంతో ఎమ్మెల్యే అవాక్కయ్యారు. ఎన్నికలప్పుడు వచ్చారు.. మళ్లీ ఇప్పుడు వచ్చారా? అని ప్రశ్నించడంతో ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. గడప గడప వైసీపీ కార్యక్రమంలో ప్రజా వ్యతిరేకత వస్తోంది.
అనకాపల్లి జిల్లా, నర్సీపట్నంలోని కృష్ణదేవునిపేట పంచాయతీలో ఎమ్మెల్యే ఉమాశంకర్‌ను స్థానికులు నిలదీశారు. సమస్యలపై కడిగిపారేశారు.
ఇవి కూడా చదవండి