Viral News: కోడి పుంజుకు ఘన నివాళి.. దశదినకర్మ జరిపించి 500 మందికి భోజనాలు.. కన్నీళ్లు పెట్టుకున్న యజమాని..

ABN , First Publish Date - 2022-07-24T01:36:39+05:30 IST

వీరోచిత పోరాటం చేసి మరణించిన ఓ కోడి పుంజుకు దాని యజమాని ఘన నివాళులర్పించాడు.

Viral News: కోడి పుంజుకు ఘన నివాళి.. దశదినకర్మ జరిపించి 500 మందికి భోజనాలు.. కన్నీళ్లు పెట్టుకున్న యజమాని..

వీరోచిత పోరాటం చేసి మరణించిన ఓ కోడి పుంజు (Rooster)కు దాని యజమాని ఘన నివాళులర్పించాడు. అంత్యక్రియలు నిర్వహించడమే కాకుండా దశదిన కర్మ కార్యక్రమాన్ని కూడా నిర్వహించాడు. 500 మందికి భోజనాలు పెట్టించాడు. ఆ కోడిని తలుచుకుంటూ దాని యజమాని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ వింత ఘటన ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రంలోని ప్రతాప్‌గఢ్ జిల్లాలో జరిగింది. ఆ గ్రామంలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. 


ఇది కూడా చదవండి..

Heart wrenching incident: కూతుళ్లను నదిలో పారేసి.. హాయిగా నిద్రపోయిన తల్లి.. పిల్లల కోసం అంతా వెతుకుతోంటే..


ప్రతాప్‌గఢ్ జిల్లాలోని బెహదౌల్ కలాన్ గ్రామానికి చెందిన సాలిక్రమ్ సరోజ్ అనే వ్యక్తి ఓ కోడి పుంజును పెంచుకుంటున్నాడు. దానికి లాలీ అని పేరు పెట్టుకుని అపురూపంగా చూసుకుంటున్నాడు. ఇటీవల ఆ కోడి పుంజు తన యజమానికి చెందిన నెల వయసున్న గొర్రె పిల్లను తన ప్రాణాలకు తెగించి కాపాడింది. సరోజ్‌కు చెందిన గొర్రె పిల్లపై ఓ వీధి కుక్క దాడి చేయడానికి ప్రయత్నించింది. ఆ గొర్రెపిల్లను కాపాడేందుకు కోడిపుంజు రంగంలోకి దిగింది. వీధి కుక్కతో వీరోచితంగా పోరాడి గొర్రె పిల్లను కాపాడింది. అయతే ఆ క్రమంలో తన ప్రాణాలను కోల్పోయింది. 


కోడిపుంజు త్యాగం, ప్రేమకు చలించిపోయిన సరోజ్ కుటుంబం దానికి ఘనంగా అంత్యక్రియలు నిర్వహించింది. అంతేకాకుండా చనిపోయిన కోడిపుంజుకు దశదినకర్మను కూడా నిర్వహించింది. పదో రోజున స్థానికులు, బంధుమిత్రులను దాదాపు 500 మందిని పిలిచి భోజనాలు కూడా పెట్టించింది. భోజనాలకు హాజరైన వారందరూ కోడి పుంజు త్యాగంపై ప్రశంసలు కురిపించారు. వారందరి మాటలు విని సరోజ్ కన్నీటి పర్యంతమయ్యాడు. సరోజ్ కుటుంబీకులు చేసిన ఈ పని స్థానికంగానే కాకుండా జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 

Updated Date - 2022-07-24T01:36:39+05:30 IST