స్పృహ కోల్పోయి వృద్ధుడి మృతి

ABN , First Publish Date - 2022-07-02T05:46:53+05:30 IST

భోగాపురం మార్కెట్‌ ఎత్తుబ్రిడ్డి సమీప సర్వీస్‌ రహదారి పక్కన శుక్రవారం ఓ వృద్ధుడు మృతిచెందాడు.

స్పృహ కోల్పోయి వృద్ధుడి మృతి

భోగాపురం: భోగాపురం మార్కెట్‌ ఎత్తుబ్రిడ్డి సమీప సర్వీస్‌ రహదారి పక్కన శుక్రవారం ఓ వృద్ధుడు మృతిచెందాడు. స్థానికులు అందించిన వివరాల ప్రకారం.. గాబువానిపేటకు చెందిన బమ్మిడి పైడితల్లి(65) రోడ్డుపక్కన నడుచుకుంటూ వస్తూ సర్వీస్‌ రహదారి సమీపంలో ఉన్న ఓ దుకాణం ముందు స్పృహ కోల్పోయి పడిపోయాడు. ఇంతలో స్థానికులు వెళ్లి చూడగా మృతిచెంది ఉన్నాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. భోగాపురం ఆసుపత్రికి వెళ్లి వస్తానని చెప్పి, ఇంటి నుంచి బయలుదేరి వెళ్లాడని, ఇంతలో ఈ విధంగా మృతిచెందాడని రోధించారు. మృతుడికి భార్య అప్పలనర్శమ్మ, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు అందలేదు. 

 

Updated Date - 2022-07-02T05:46:53+05:30 IST