Advertisement
Advertisement
Abn logo
Advertisement

ప్రభుత్వం బలవంతపు వసూళ్లు ఆపాలి

మామిడికుదురు, డిసెంబరు 3: ఓటీఎస్‌ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న బలవంతపు వసూళ్లను ఆపాలని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు డిమాండ్‌ చేశారు. మామిడికుదురులో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పేద, మధ్య తరగతి కుటుంబాల నుంచి ప్రభుత్వం ఓటీఎస్‌ పేరుతో బల వంతపు వసూళ్లు చేయడం తగదన్నారు. ప్రభుత్వం అధి కారులను లబ్ధిదారుల ఇంటికి పంపించి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, ఇది దుర్మార్గ చర్య అని అభివర్ణించారు. కార్యక్రమంలో ఈలి శ్రీనివాస్‌, వర్థినేని బాబ్జి, యర్రంశెట్టి తాతబుజ్జి, వాసంశెట్టి శంకరరావు, నయినాల సత్యనారా యణమూర్తి, మానేపల్లి బాలాజీవేమా, పెచ్చెట్టి భాస్కర రావు, యెరుబండి బుజ్జి  పాల్గొన్నారు. 

 Advertisement
Advertisement