మాఫియా కనిపించేది జైల్లో లేదంటే ఎస్పీలో: అమిత్ షా

ABN , First Publish Date - 2022-02-03T00:01:49+05:30 IST

బెహెన్‌జీ (మాయావతి), అఖిలేష్ ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు రాష్ట్రంలో మాఫియా పెద్ద ఎత్తున ఉండేది. యూపీ ప్రజల్ని గూండాలు అనేక ఇబ్బందులకు గురి చేసే వారు. కానీ యోగి ముఖ్యమంత్రి అయ్యాక కొంత మంది గూండాలు జైలుకు వెళ్లారు..

మాఫియా కనిపించేది జైల్లో లేదంటే ఎస్పీలో: అమిత్ షా

లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాక ముందు ప్రజలను గూండాలను ఇబ్బందులకు గురి చేసే వారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శించారు. పరోక్షంగా పూర్వ ముఖ్యమంత్రులు మాయావతి, అఖిలేష్‌ యాదవ్‌లను లక్ష్యంగా చేసుకుని ఆయన విమర్శలు గుప్పించారు. కానీ యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయ్యాక.. గూండాలు మాఫియా యూపీ వదిలి పారిపోయారని, ప్రజలు సురక్షితంగా ఉన్నారని అమిత్ షా అన్నారు.


బుధవారం రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో అమిత్ షా పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘‘మీరు మాఫియా గురించి ఆరా తీస్తే మూడు చోట్ల కనిపిస్తారు.. ఒకటి జైల్లో, రెండోది ఉత్తరప్రదేశ్ బయట, మూడోది సమాజ్‌వాదీ పార్టీ లిస్టులో’’ అని అన్నారు. ఇక ఎస్పీ, బీఎస్పీలపై ఆయన స్పందిస్తూ ‘‘బెహెన్‌జీ (మాయావతి), అఖిలేష్ ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు రాష్ట్రంలో మాఫియా పెద్ద ఎత్తున ఉండేది. యూపీ ప్రజల్ని గూండాలు అనేక ఇబ్బందులకు గురి చేసే వారు. కానీ యోగి ముఖ్యమంత్రి అయ్యాక కొంత మంది గూండాలు జైలుకు వెళ్లారు. కొంత మంది గూండాలు యూపీ వదిలి పారిపోయారు’’ అని అన్నారు.

Updated Date - 2022-02-03T00:01:49+05:30 IST