Abn logo
Mar 30 2021 @ 02:02AM

తృణమూల్‌ గూండాల దాడి వల్లే..

బీజేపీ కార్యకర్త తల్లి మృతిపై అమిత్‌ షా వ్యాఖ్యలు


నందిగ్రామ్‌, మార్చి 29: పశ్చిమబెంగాల్‌లో బీజేపీ కార్యకర్త తల్లి, 85 ఏళ్ల వృద్ధురాలి మృతిపై రాజకీయ దుమారం చెలరేగింది. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని నిమ్తలో తృణమూల్‌ కార్యకర్తలు దాడి చేయడంతో బీజేపీ కార్యకర్త తల్లి మజుందార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు. ఈ ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా తీవ్రంగా స్పందించారు. తృణమూల్‌ గూండాల దాడిలో మజుందార్‌ మరణించారని, ఆమె కుటుంబం బాధ తీర్చలేనిదని, అది బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీని సుదీర్ఘకాలం వెంటాడుతుందని సోమవారం ట్విటర్‌లో పేర్కొన్నారు. ఈ ట్వీట్‌కు సీఎం మమత ఘాటుగా బదులిచ్చారు. మజుందార్‌ మృతికి గల కారణాలు తనకు పూర్తిగా తెలియరాలేదన్నారు. బీజేపీ పాలిత యూపీలోని హథ్రా్‌సలో మహిళను చిత్రహింసలు పెట్టి చంపేశారని.. అలాంటి దారుణం జరిగినప్పుడు అమిత్‌ షా ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.  

అసోంలో మరో ఏడుగురు బీజేపీ నేతల బహిష్కరణ


గువాహటి, మార్చి29: అసోంలో అధికార బీజేపీ మరో ఏడుగురు నేతలపై వేటు వేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు ఇవ్వకపోవడంతో బీజేపీ అభ్యర్థులు బరిలో నిలిచిన స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేసిన ఏడుగురిని ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరించారు.

Advertisement
Advertisement