Abn logo
Oct 11 2021 @ 19:08PM

బొగ్గు శాఖ మంత్రితో సమావేశమైన అమిత్‌షా

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా బొగ్గు కొరతతో విద్యుత్ సంక్షోభం పొంచి ఉందన్నఆందోళనల నేపథ్యంలో పరిస్థితిని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సోమవారంనాడు సమీక్షించారు. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్‌కే సింగ్, బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌టీపీసీ) అధికారులతో  హోం మంత్రిత్వ శాఖ కార్యాలయంలో అమిత్‌షా అత్యున్నత స్థాయి సమావేశం జరిపారు. బొగ్గు కొరత కారణంగా విద్యుత్ సంక్షోభం తలెత్తే అవకాశాలపై ఈ సమావేశంలో చర్చించారు.

బొగ్గు కొరత కారణంగా విద్యుత్ సంక్షోభం పొంచి ఉందంటూ ఇప్పుటికే పలు రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేశాయి. అయితే విద్యుదుత్పాదన ప్లాంట్లకు అవసరమైనంత 'డ్రై ఫ్యూయల్' అందుబాటులో ఉందని కేంద్రం చెబుతోంది. కాగా, ప్లహ్లాద్ జోషి ఆదివారంనాడు ఓ ట్వీట్‌లో బొగ్గు ఉత్పత్తి, సరఫరా పరిస్థితిని సమీక్షించినట్టు పేర్కొన్నారు. విద్యత్ సరఫరాలో ఎలాంటి అవంతారాలు ఉండవని ఆయన భరోసా ఇచ్చారు. 24 రోజుల కోల్ డిమాండ్‌కు సరిపడే 43 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్టు చెప్పారు. వినియోగం కంటే కోల్ డిస్పాచ్ ఎక్కువగా ఉందని, బొగ్గు నిల్వలు క్రమంగా పెరుగుతున్నాయనడానికి ఇది సంకేతమని పేర్కొన్నారు. 

ఇవి కూడా చదవండిImage Caption

జాతీయంమరిన్ని...