ఆఫ్ఘన్‌కు ఆయుధాల విక్రయంపై అమెరికా కీలక నిర్ణయం

ABN , First Publish Date - 2021-08-19T23:53:25+05:30 IST

తాలిబన్ల నేతృత్వంలోని ఆఫ్ఘనిస్థాన్‌కు అన్ని రకాల ఆయుధాల

ఆఫ్ఘన్‌కు ఆయుధాల విక్రయంపై అమెరికా కీలక నిర్ణయం

వాషింగ్టన్ : తాలిబన్ల నేతృత్వంలోని ఆఫ్ఘనిస్థాన్‌కు అన్ని రకాల ఆయుధాల అమ్మకాలను నిలిపేయాలని అమెరికా నిర్ణయించింది. పెండింగ్, లేదా, అన్ డెలివర్డ్ ఆయుధాల బట్వాడాను సమీక్షకు పెట్టినట్లు స్టేట్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన రాజకీయ/మిలిటరీ వ్యవహారాల బ్యూరో తెలిపింది. ఈ మేరకు డిఫెన్స్ కాంట్రాక్టర్లకు ఓ నోటీసును స్థానిక కాలమానం ప్రకారం బుధవారం జారీ చేసింది. 


ఆఫ్ఘనిస్థాన్‌లో పరిస్థితులు వేగంగా మారుతుండటంతో, పెండింగ్‌లో ఉన్న, ఇప్పటికే జారీ చేసిన ఎగుమతి లైసెన్సులను, ఇతర అప్రూవల్స్‌ను సమీక్షించనున్నట్లు తెలిపింది. ప్రపంచ శాంతి, అమెరికా జాతీయ భద్రత, విదేశాంగ విధానాలకు అనుగుణంగా వీటిని సమీక్షించనున్నట్లు తెలిపింది. రానున్న రోజుల్లో తాజా సమాచారాన్ని డిఫెన్స్ ఎక్విప్‌మెంట్ ఎక్స్‌పోర్టర్లకు తెలియజేస్తామని తెలిపింది. 


ఇదిలావుండగా, ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికా దళాలను ఈ నెల 31తో పూర్తిగా ఉపసంహరించాలని గతంలో నిర్ణయించారు. తాజాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాట్లాడుతూ, ఆఫ్ఘనిస్థాన్‌లోని ప్రతి అమెరికన్ తిరిగి స్వదేశానికి వచ్చే వరకు ఆ దేశంలో అమెరికన్ దళాలను ఉంచుతామని చెప్పారు. అంటే ఆగస్టు 31 తర్వాత కూడా అమెరికా దళాలు ఆఫ్ఘనిస్థాన్‌లో ఉండే అవకాశం కనిపిస్తోంది. 


ఆఫ్ఘనిస్థాన్‌లో దాదాపు 15 వేల మంది అమెరికన్లు ఉన్నట్లు అంచనా. వేలాది మంది ఆ దేశం విడిచి పారిపోయేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుండగా, అక్కడి హింసాత్మక దృశ్యాలు ప్రపంచాన్ని కలచివేస్తున్నాయి. ఈ పరిణామాలతో జో బైడెన్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 


Updated Date - 2021-08-19T23:53:25+05:30 IST